కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

GHMC ఏరియాలోని నగర వాసులను కరోనా వైరస్ వణికిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ బారిన పడుతున్నారు. లేటెస్టుగా కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా సూపరింటెండెంట్‌ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అదే హాస్పిటల్‌లో ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. సూపరింటెండెంట్‌‌తో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రి సిబ్బంది అందరికి ఆరోగ్య శాఖ కరోనా టెస్టులు నిర్వహించనుంది.