
హార్ట్ఎటాక్ తో రిటైర్డ్ ఉద్యోగి మృతి
మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
అడవిలో ఖననం చేసిన బంధువులు
మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
అడవిలో ఖననం చేసిన బంధువులు
జయశంకర్‌భూపాలపల్లి, వెలుగు: కరోనా వ్యాధి వచ్చిందని తెలిసిన క్షణంలోనే గుండెపోటుతో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మృతిచెం దారు. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన భాస్కర్(65) ప్రభుత్వ సంస్థ అయిన జీసీసీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఈ నెల 17న శుక్రవారం జ్వరం రాగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. జ్వరంతగ్గకపోగా పేషేంట్‌కు ఛాతిలో నొప్పి వస్తుండటంతో వరంగల్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ నెల 20న వరంగల్‌కు వెళ్లి చూపించుకోగా కరోనా లక్షణాలు ఉన్నాయని ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా చెప్పారు. ఎంజీఎంలో సోమవారం భాస్కర్‌నుంచి శాంపిల్స్ తీసుకున్న డాక్టర్లు మూడు రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు.
దాంతో భాస్కర్ వరంగల్ పట్టణంలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లారు. ఈ నెల 22న సాయంత్రం భాస్కర్‌కు బావ అయిన వ్యక్తికి ఎంజీఎం నుంచి ఫోన్ వచ్చింది. ఆయన తన ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. భాస్కర్‌కు పాజిటివ్ వచ్చిందని ట్రీట్మెంట్ కోసం ఎంజీఎం ఆసుపత్రికి రావాలని వాళ్లు ఫోన్‌లో అన్న మాటలు విన్న భాస్కర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఎంజీఎం తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లు చెప్పారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.
ఊర్లోకి రానివ్వలె

ఎయిర్ లైన్స్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్, వెలుగు: కరోనా భయంతో ఎయిర్‌లైన్స్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలో గురువారం జరిగింది. ఎల్లారెడ్డి గూడకు చెందిన నాగేంద్ర (75) ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. జర్వం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న నాగేంద్రను కుటుంబసభ్యులు బుధవారం చెస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం శ్రీనగర్‌కాలనీలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్‌చేశారు. తనకు కరోనా సోకిందనే భయంతో ఉన్న నాగేంద్ర గురువారం తెల్లవారుజామున హాస్పిటల్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.