కరోనా కలకలం: కేరళలో ప్రతి ఆదివారం పూర్తి లాక్ డౌన్

V6 Velugu Posted on Aug 04, 2021

కేరళ లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల కంటే ఒక కేరళలోనే అధికంగా కేసులు బయటపడుతున్నాయి. కేరళలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు భారీ స్తాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతోంది. ఇకపై ప్రతి ఆదివారం రోజున రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడోవేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో సరిహద్దు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. RTPCR నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అడుగుపెట్టనిస్తామని తమిళనాడు, కర్ణాటక సర్కార్లు నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నప్పటికీ, కేసులు కంట్రోల్ కావడంలేదు. పైగా దేశంలో రోజువారీ కేసుల్లో సగం కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే శనివారం,ఆదివారం రెండు రోజులు లాక్ డౌన్ విధించింది కేరళ ప్రభుత్వం. అయితే కొన్ని సడలింపులిచ్చింది. ప్రస్తుతం శనివారం లాక్ డౌన్ ఎత్తివేసి కేవలం ఆదివారం మాత్రం సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పదని హెచ్చరించింది.

Tagged Corona situation, Complete Lockdown, Kerala, every Sunday

Latest Videos

Subscribe Now

More News