ఖమ్మంలో పాజిటివ్.. గాంధీలో నెగెటివ్

ఖమ్మంలో పాజిటివ్.. గాంధీలో నెగెటివ్

ఖమ్మం అర్బన్, వెలుగు: ఆయనో డాక్టర్. కరోనా అనుమానంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శాంపిల్ ఇచ్చారు.పాజిటివ్ వచ్చింది. గాంధీలో టెస్ట్ చేయగా రిపోర్ట్ నెగెటివ్ వచ్చింది. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంకు చెందిన సంకల్ప ఆస్పత్రి డాక్టర్ శంకర్ నాయక్ కు ఎదురైన అనుభవం. ఈ మధ్య ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా స్క్రీనింగ్ కోసం ఆయన శాంపిల్ ఇస్తే.. టెస్టుల్లో పాజిటివ్ గా తేలింది. వెంటనే ఆ విషయాన్ని శంకర్ నాయక్ కు డీఎంహెచ్వో చెప్పారు. గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ డాక్టర్ను, డాక్టర్ భార్యను మూడు రోజులు ఉంచి టెస్టులు చేశారు. ఈసారి రిపోర్టులు నెగెటివ్ వచ్చాయి. వారితో పాటు 40 మంది ఆస్పత్రి సిబ్బందికీ టెస్టులు చేయగా నెగెటివ్ గానే తేలింది. దీంతో తనపై డీఎంహెచ్వో డాక్టర్ మాలతి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు శంకర్ నాయక్ ఫిర్యాదు చేశారు.

For More News..

ఇంట్లోనే టెస్టు.. నిమిషాల్లో రిజల్ట్

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు

డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..