తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆస్పత్రిలో చేరారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఇక్కడి కావేరీ ఆస్పత్రిలో చేరారు. గత నెల 29 నుంచి హోం క్వారంటైన్ లో ఉన్న భన్వరీలాల్ పురోహిత్..ఇవాళ(ఆదివారం) ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు రాజ్ భవన్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే గవర్నర్ గత నెల 29 నుంచి హోం క్వారంటైన్ అయ్యారు. అయితే ఇవాళ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ లో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే కావేరీ ఆస్పత్రిలో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

