
న్యూఢిల్లీ: ఇకపై టీకా సర్టిఫికెట్‌ను వాట్సాప్ ద్వారా క్షణాల్లోనే పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే కొవిన్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ ఇస్తున్న కేంద్రం.. లేటెస్ట్గా వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సర్టిఫికెట్‌ను ఈజీగా పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆఫీసు తెలిపింది. ‘కొవిడ్ సర్టిఫికెట్’ అని టైప్ చేసి 9013151515 నంబర్ కు వాట్సాప్ చేయండి. ఓటీపీ ఎంట్రీ చేసి క్షణాల్లో సర్టిఫికెట్ పొందవచ్చని పేర్కొంది.