ఎక్కడోళ్లకు అక్కడ్నే టీకా.. పనిచేసే చోటే వేయాలని నిర్ణయం

ఎక్కడోళ్లకు అక్కడ్నే టీకా.. పనిచేసే చోటే వేయాలని నిర్ణయం

గవర్నమెంట్ హెల్త్ సిబ్బందికి వాళ్లు పని చేసే చోటనే వ్యాక్సిన్

1,030 ప్రభుత్వ, 170 ప్రైవేట్ దవాఖాన్లలో సెంటర్లు
వ్యాక్సినేషన్ పై ఇయ్యాల సీఎం రివ్యూ
గాంధీ, నార్సింగి హెల్త్ సెంటర్ స్టాఫ్ తో ఇంటరాక్ట్ కానున్న ప్రధాని
పల్స్ పోలియోను వాయిదా వేసిన కేంద్రం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలోని సిబ్బందికి వాళ్లు పని చేస్తున్న చోటనే కరోనా వ్యాక్సిన్‌‌‌‌ ఇవ్వాలని స్టేట్ హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ నిర్ణయించింది. ఏఎన్‌‌‌‌ఎంలు, అంగన్‌‌‌‌వాడీ, ఆశా వర్కర్లు, హెల్పర్లు ఏ పీహెచ్‌‌‌‌సీ పరిధిలో పనిచేస్తే అదే పీహెచ్‌‌‌‌సీలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రాష్ర్టంలో వంద కంటే ఎక్కువ మంది సిబ్బంది పని చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లు 170 ఉండగా… ఆయా హాస్పిటళ్లలోనే సెంటర్లు ఏర్పాటు చేసి, ఆ స్టాఫ్​ కు వ్యాక్సిన్ వేయనున్నారు. వంద కంటే తక్కువ మంది పని చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్ల సిబ్బందికి వారి హాస్పిటల్‌‌‌‌కు దగ్గర్లోని పీహెచ్‌‌‌‌సీలో వ్యాక్సిన్ వేస్తారు.  ఎవరెవరికి ఎక్కడ వ్యాక్సిన్ వేస్తామనే దానిపై ఒకట్రెండు రోజుల ముందే వారికి సమాచారం ఇస్తామని డీహెచ్‌‌‌‌ శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సినేషన్ మొదటి రోజు (ఈ నెల 16న) రాష్ర్ట వ్యాప్తంగా 40 ప్రైవేట్, 99 ప్రభుత్వ దవాఖాన్లలోని సెంటర్లలో టీకా ఇవ్వనున్నారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌‌‌‌లో 13, మేడ్చల్‌‌‌‌లో 11, రంగారెడ్డిలో 9 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన జిల్లాల్లో 3 నుంచి 6 సెంటర్లలో టీకా వేయనున్నారు.  మళ్లీ 17న గ్యాప్ ఇచ్చి, 18 నుంచి 1,200  సెంటర్లలో వ్యాక్సినేషన్ కొనసాగించనున్నారు. గాంధీ, ఉస్మానియా లాంటి పెద్ద దవాఖాన్లలో ఒకటి కంటే ఎక్కువ సెంటర్లు పెట్టనున్నారు. వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం 850 ప్రైమరీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఐస్‌‌‌‌ లైన్‌‌‌‌డ్‌‌‌‌ రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉన్నాయని డీహెచ్ చెప్పారు. సోమ లేదా మంగళవారం నాడు హైదరాబాద్‌‌‌‌కు వ్యాక్సిన్ వస్తుందని తెలిపారు. వ్యాక్సినేషన్ కు రెండ్రోజుల ముందు జిల్లా కేంద్రాల్లోని స్టోరేజ్ సెంటర్లకు,  ఒక రోజు ముందు వ్యాక్సినేషన్ సెంటర్లకు పంపుతామన్నారు.

నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోనా వ్యాక్సినేషన్ మొదటి రోజున గాంధీ హాస్పిటల్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌తో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో మాట్లాడనున్నారు. వ్యాక్సినేషన్‌‌‌‌, ఇతర అంశాలపై ప్రధాని ఆరా తీసే అవకాశం ఉందని హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. సోమవారం అన్ని రాష్ర్టాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే రాష్ర్టంలో వ్యాక్సినేషన్‌‌‌‌ పంపిణీపై సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ హెల్త్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించనున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారా? లేదా? తొలి వ్యాక్సిన్ ఎవరికి వేస్తారు? అనే విషయంపై తర్వాత క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు పేర్కొన్నారు.

పల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలియో వాయిదా

కరోనా వ్యాక్సినేషన్ కారణంగా ఈ నెల 17న జరగాల్సిన పల్స్ పోలియో వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్రం వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా ఒకేరోజు జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం అరుదు. కానీ కరోనా వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెల్త్ స్టాఫ్ బిజీగా ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పోలియో వ్యాక్సినేషన్‌‌‌‌కు మరో తేదీ ప్రకటిస్తా మని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.

For More News…

ఉద్యోగులకు గంపగుత్తగా ప్యాకేజీ ప్రకటించనున్న సీఎం!