15 రోజుల్లో జనానికి రష్యా వ్యాక్సిన్

15 రోజుల్లో జనానికి రష్యా వ్యాక్సిన్
  • 40 వేల మందిపై స్పత్నిక్ బఫేజ్ 3 ట్రయల్స్
  • రెండో వ్యాక్సిన్ పైనా టెస్టులు షురూ
  • డిసెంబర్ నాటికి పక్కా అంటున్న ఆక్స్ ఫర్డ్
  • ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ఈ ఏడాది చివర్లోనే
  • ఫేజ్2/3 ట్రయల్స్ దశలో భారత్ బయోటికె,జైడస్ క్యాడిలా టీకాలు
  • జనవరి నాటికి వస్తాయంటున్న ఎక్స్ ఫర్ట్స్
  •  డిసెంబర్ నాటికి తెచ్చేందుకు కేంద్రం పట్టుదల
  • అన్ని కరోనా వైరస్ లకు ఒకటే వ్యాక్సిన్ తయారు చేసిన కేంబ్రిడ్జి వర్శిటీ

ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు 150 దాకా వ్యాక్సిన్ క్యాండిడేట్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో  46 వ్యాక్సిన్స్ మనుషులపై ప్రయోగాల దశకు వచ్చాయి..ఓ తొమ్మిది వ్యాక్సిన్లపై ఫేజ్ 3 ట్రయల్స్  జరుగుతున్నాయి. అందులో మన దేశానికి చెందిన రెండు వ్యాక్సిన్లు ఉన్నాయి. రష్యా ఇప్పటికే స్పుత్నిక్v నే వ్యాక్సిన్ ను రిజిస్టర్ కూడా చేయించింది. ఫేజ్ 3 ట్రయల్స్  ను మొదలు పెట్టి మరో 15 రోజుల్లో జనానికి వ్యాక్సిన్ ఇచ్చేస్తామని  ధీమాగా చెప్పింది. ముందు నుంచీ అందరిలోనూ భరోసా నింపింది. మాత్రం ఆక్స్ పర్డ్ వ్యాక్సినే. డిసెంబర్ లోపు వ్యాక్సిన్ ను తెస్తామని మొదట్లో ధీమాగా చెప్పింది ఆక్స్ ఫర్డ్. దానికి తగ్గట్టే వేగంగా ట్రయల్స్ జరుగుతున్నాయి.  ఆక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అప్రూవల్స్ పొందేందుకు వేగంగా అడుగులు పడిపోతున్నాయి. మన దేశం నుంచి భారత్ బయోటిక్ కొవ్యాక్సిన్ క్యాడిలా జైకోవీడీ వ్యాక్సిన్ లు రేసులో ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి మనద శంలో వ్యాక్సిన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నా..ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి తేవాలన్న పట్టుదలతో ఉంది మన సర్కార్ .

ఇప్పటికే ‘స్పుత్నిక్–V’ వ్యాక్సిన్ ను రిలీజ్ చేసిన రష్యా.. దాన్ని ప్రజలకు ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసింది. మరో 15 రోజుల్లోనే జనానికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేనుంది. ‘‘సెప్ట ెంబర్ 3 వరకు మెడికల్ సెంటరకు ్ల వ్యాక్సిన్ పంపిస్తాం. సెప్ట ెంబర్ 4 లేదా 5న వాలంటీ రకు ్ల వ్యాక్సిన్ ఇస్తాం” అని గమలేయా ఇనిస్టిట్యూట్ డైరెకర్ అలెగ ్ట ్జాండర్ తెలిపారు. సెప్ట ెంబర్ 15 నుంచి 20 మధ్య ప్రజలకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రాసెస్ ప్రారం భమవుతుందని చెప్పారు. మరోవైపు స్పుత్నిక్–V వ్యా క్సిన్ విషయంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో రష్యా ఎక్కువ మందిపై ట్రయల్స్మొదలుపెట్టింది. ఇప్పటికే 2వేల మందిపై థర్ ఫేజ్ ట్రయల్ డ్ స్మొదలుపెట్టామన్న ఆ దేశం.. ఇప్పుడు పోస్టురిజిస్ట్రే షన్ ట్రయల్స్పేరుతో 40వేల మంది వాలంటీరీలకు  వ్యాక్సిన్ ఇస్తోంది. ఆగస్టు24 నుంచే ఈ ట్రయల్స్ మొదలైనట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. పోస్టురిజిస్ట్రే షన్ ట్రయల్స్ కోసం గమలేయా ఇనిస్టిట్యూట్ కు రష్యా పర్మిషన్ ఇచ్చిందని లోకల్ మీడియా తెలిపింది. మాస్కోలోని గవర్నమెం ట్ హాస్పిటళ్లలో ట్రయల్స్నిర్వహిస్తున్నట్లువెల్లడించిం ది. 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న40వేల మంది వాలంటీరీలపై వ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నారు. టీకా ఇచ్చిన రోజు నుంచి 6 నెలల పాటు వీరినిఅబ్జ ర్వ్ చేయనున్నారు. రష్యన్ డైరెక్ట్ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్ డీఐఎఫ్)తో కలిసి గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ‘‘స్పుత్ని క్–V” వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది. ఈ వ్యాక్సిన్ ను రష్యా ఆగస్టు11న రిజిస్ట ర్ చేయించింది. అయితే ఫేజ్ 1, 2 ట్రయల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిం చకపోవడంతో సైంటిస్టులు సందేహాలు వ్యక్తం చేశారు. మరోవైపు థర్డ్  ఫేజ్ ట్రయల్స్ పూర్తి చేయక ముందే వ్యాక్సిన్ ను విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్: చేడాక్స్ 1ఎన్ కోవ్ 19 ఫేజ్ 3 ట్రయల్స్ నడుస్తున్నాయి. మన దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ట్రయల్స్ చేస్తుంది. డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ ను  తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి

భారత్ బయోటిక్ కోవ్యాక్సిన్: తొలి దేశీయ వ్యాక్సిన్ పేజ్ 2/3 కంబైన్డ్ ట్రయల్స్ దశలో ఉంది. నిమ్స్ లోనూ ట్రయల్స్ జరుగుతున్నాయి.డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి.

ఫైజర్: బీఎన్ట 16బీ2 వ్యాక్సిన్ కూడా డిసెంబర్ నాటికి వచ్చే అవకాశాలున్నాయి. 10 కోట్ల డోసులకు అమెరికా ఇప్పటికే  ఆర్డర్ కూడా పెట్టింది. అక్టోబర్ రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చే అవకాశం ఉంది.

రష్యా స్పుత్నిక్ v: ఈ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ మొదలయ్యాయి. 40 వేల మందికిచ్చి టెస్టు చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నుంచి జనానికి వ్యాక్సిన్ ఇస్తామని ఆ దేశం తాజాగా ప్రకటించింది.

చైనా రెండు వ్యాక్సిన్లు: వీటికి ఎమర్జెన్సీ యూజ్ కు అనుమతించారు. సినోవ్యాక్ తయరు చేసిన కరోనా వ్యాక్, సీఎన్ బీజీ తయారు చేసిన ఇంకో వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. నాలుగు వ్యాక్సిన్లు ఫేజ్ 3 దశలో ఉన్నాయి.

కేంబ్రిడ్జి వ్యాక్సిన్: అన్ని కరోనా వైరస్ లకు ఒకటే వ్యాక్సిన్ డియోస్ కొవ్యాక్స్ 2 తయారు చేసింది. కేంబ్రిడ్జి వర్శిటీ దీన్ని సూది లేకుండా స్ప్రింగ్ తో జెట్ ఇంజెక్షన ద్వారా ఇస్తారు. ఈ ఏడాది చివరికి ట్రయల్స్ మొదలవుతాయి.

మరో వ్యాక్సిన్ రెడీ కరోనాకు ప్రపంచంలోనే ఫస్ట్ వ్యాక్సిన్ రిలీజ్ చేసిన రష్యా మరో వ్యాక్సిన్ కూడా తయారు చేసింది. ఇప్పుడా వ్యాక్సిన్ అడ్వాన్స్ డ్ ట్రయల్ స్టేజ్ లో ఉందని తెలిసింది. ఈ వ్యాక్సిన్ కు సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో రష్యా అప్రూవల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సైబీరియాలోని వెక్టార్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది.

మన దేశంలో ప్రొడక్షన్.. రష్యా మన దేశంతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతోంది. వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్, తయారీకి సంబంధించి చర్చలు జరుపుతోంది. మాస్కోలోని మన ఎంబసీ అధికారులు రష్యా ప్రతినిధులతో డిస్కషన్స్ చేస్తున్నారు. మరికొన్ని వారాల్లో నే మన దేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ ప్రొడక్టులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా ఒకటి. అందుకే రష్యా వ్యాక్సిన్ ప్రొడక్షన్ కు మన దేశంతో చేతులు కలుపుతోంది. ‘‘రష్యాతో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ కు సంబంధించి కొంత సమాచారం ఇచ్చింది. పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అందాల్సి ఉంది” అని సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ తెలిపారు. ‘‘వ్యాక్సిన్ ఉత్పత్తి ముఖ్యమైన అంశం. మేం ఇండియాతో కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఇండియా డిమాండ్ కు తగ్గట్లు ఉత్పత్తి చేయగలదని మేం నమ్ముతున్నాం” అని ఆర్డీఐఎఫ్సీఈఓ కిరిల్ డిమిత్రివ్ చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ను ఒక్క రష్యాలోనే కాకుండా యూఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండియాలోనూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే 5 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు.