హైదరాబాద్ లో కరోనా కంట్రోల్

హైదరాబాద్ లో  కరోనా కంట్రోల్
  • రాష్ట్రంలో వచ్చే నెలాఖరుకు కేసులు తగ్గి పోతాయి
  • సర్కారీ హాస్పిటళ్ల లో బెడ్స్ నిండాకే ప్రైవేట్ బెడ్స్ తీసుకుంటం
  • పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  శ్రీనివాసరావు తెలిపారు. సర్కా రు తీసుకుంటున్న చర్యలతో గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కంట్రోల్లోకి వచ్చిందని, కేసులు కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కొద్దిరోజుల్లో కేసుల సంఖ్య బాగా తగ్గిపోతుందన్నారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ ఆఫీసులో మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్ట  రమేశ్ రెడ్డితో కలసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్కార్ హాస్పిటళ్లలో బెడ్లన్నీనిండాకే ప్రైవేట్ హాస్పిటల్స్లో 50 శాతం బెడ్స్ను తీసుకుని.. పేషెంట్లను పంపుతామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో  అన్ని బెడ్స్ కు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యా కేజీల ప్రకారమే వైద్యం అందించాలని, సగం పడకలు తమకిష్టం వచ్చినట్లుగా చార్జీలు చార్జీ వసూలు చేసేందుకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్స్నిర్వాహకులు వారి ప్రతిపాదనలతో ఒకటి, రెండు రోజుల్లో చర్చ లకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల వల్లే ప్రైవేటుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు.

మొదటి నుంచీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యం అందించడం పైనే దృష్పెటి ట్టారని గుర్తు చేశారు. ప్రైవేటు హాస్పిటల్స్పై గతంలో రోజుకు 25 వరకు ఫిర్యాదులు వచ్చేవని , ప్రస్తుం ఐదారుకు మించి రావడం లేదని.. అందులో మూడు, నాలుగు ఫిర్యాదులు అధిక బిల్లులకు సంబంధించినవి ఉన్నాయన్నారు. ప్రజలు ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్లిడబ్బులు పొగొట్టుకో వద్దన్నారు. టెస్టుల విషయంలో ప్రభుత్వం చాలా స్ట్రాటజికల్ గా వ్యవహరించిందని, ఎప్పుడు పెంచాలో అప్పుడే పెంచిందని పేర్కొన్నారు. వ్యాక్సి న్ వచ్చేవరకు ప్రజలు జాగ్రత్తగా ఉండా ల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా ట్రీట్ మెంట్ అందిస్తున్న 2 వేల మంది వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం సీజనల్ వ్యాధుల తీవ్రత తక్కువగా ఉందని.. డెంగీ , స్వైన్ ఫ్లూకేసులు చాలా తక్కువగా నమో దయ్యాయనిమెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేశ్ రెడ్డి తెలిపారు.