బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. మనోజ్ భార్య ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

శనివారం (మే 21) హైదారాబాద్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి.. సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనపై భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.

 ఎంజీఎం హాస్పిటల్  వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జిముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత జైలుకు తరలించనున్నారు.  ఈ సమయంలో BRS లీగల్ టీం వచ్చాక వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని పోలీసులను కోరారు కౌశిక్ రెడ్డి.