కరోనా ఎఫెక్ట్.. నాన్ వెజ్ తినడం ఆపేశారు

కరోనా ఎఫెక్ట్.. నాన్ వెజ్ తినడం ఆపేశారు

కరోనా వైరస్ తో  చైనా వణికిపోతుంది.  రోజురోజుకు వైరస్ తో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కరోనా ఎఫెక్ట్ భారత్ పైనా పడింది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్టయ్యాయి. అనుమానితులకు ముందస్తు గానే టెస్టులు చేస్తున్నారు. ఇక కరోనా ప్రభావం ఇప్పుడు నాన్ వెజ్ అమ్మకాలపై పడింది.  జంతువుల వల్లే వైరస్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో మాంసాహారం తినేవారు భయపడుతున్నారు. ఉన్నపళంగా చికెన్, మటన్ తో పాటు సీ ఫుడ్ తినడం ఆపేశారు.

కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ జనాన్ని మరిత కలవరపెడుతున్నాయి. చైనా నుండి వచ్చిన వారితో ఈ వైరస్ ఇండియాలో వ్యాపించిదనే వార్తలొచ్చాయి. కేరళలో రెండు పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. హైద్రాబాద్ లోనూ గాంధీ హాస్పిటల్లో అనుమానితులకు స్పెషల్ టెస్టులు చేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాపించకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జంతువుల నుంచే వైరస్ ఎక్కువగా వస్తుందనే కారణంతో చికెన్, మటన్ అంటేనే భయపడుతున్నారు పబ్లిక్. దీంతో గిరాకీ లేక మటన్, చికెన్ షాపులు డల్లయ్యాయి.

వైరస్ వస్తుందనే ప్రచారంతో తమ వ్యాపారం తగ్గిందని అంటున్నారు వ్యాపారులు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో జనం చికెన్ కొనేందుకు రావడం లేదని చెప్తున్నారు. నాన్ వెజ్ తింటే కరోనా వైరస్ వస్తుందనే అపోహ జనాల్లో ఉందని అంటున్నారు.

కరోనా వైరస్ కారణంగా హైద్రాబాద్ లో మాంసం అమ్మకాలు పడిపోయాయి. మటన్, చికెన్, ఫిష్ తింటేనే వైరస్ రాదని డాక్టర్లు, నిపుణులు చెప్తున్నా జనం మాత్రం వీటికి దూరంగానే ఉంటున్నారు.