బ్రిటన్‌ వైద్య ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్‌

బ్రిటన్‌ వైద్య ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్‌

బ్రిటన్‌ వైద్య ఆరోగ్య మంత్రి నాడిన్ డోరిస్ కు కరోనా వైరస్ సోకింది. గత కొన్ని రోజులుగా ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉండటంతో పాటు జ్వరం, జలుబుతో బాధపడుతూ ఉండటంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం డాక్టర్ల సలహాపై ముందుజాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఓ గదిలో ఉంటున్నానని ఆమె తెలిపారు. డోరీస్ గతంలో స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్, పార్లమెంటరీ అండర్ సెక్రటరీగానూ విధులు నిర్వర్తించారు. యూకేలో కరోనా వైరస్ సోకిన మొదటి ప్రజాప్రతినిధి డోరీస్. ఇప్పటివరకూ బ్రిటన్ లో 380 మందికి కరోనా సోకగా…. ఆరుగురు చనిపోయారు.