కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో విదేశాల నుంచి లేదా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలను స్వచ్ఛందంగా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తెలియజేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కోరింది. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణమే ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయాలని చెప్పింది. ఇప్పటికే పలు పట్టణాల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను తీసుకుంటున్నట్లు చెప్పింది. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. అనుమానం ఉన్న వ్యక్తులను క్వారంటైన్ లో ఉంచుతున్నారు.
కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్స్..
040-23450624
040-23450735

