
వైరస్ ప్రభావంతో చైనాలో తిండి రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో తిండి రేట్లతో పోలిస్తే ఈ ఏడాది 21.4 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా కన్జ్యూమర్ ధరలు 5.2 శాతం పెరిగాయి. పోర్క్ ధరలు రెట్టింపయ్యాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ భయాల నేపథ్యంలో పోర్క్ ధరలు 9.3 శాతం ఎక్కువయ్యాయి. మంగళవారం చైనా సర్కార్ విడుదల చేసిన రిపోర్ట్ ఈ విషయాలను వెల్లడించింది. కూరగాయల ధరలూ 9.5 శాతం పెరిగినట్టు రిపోర్ట్ వెల్లడించింది. కొవిడ్‌కు మూల కారణమైన వుహాన్ సిటీలో పరిస్థితిని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమీక్షించారు. కొవిడ్ వ్యాప్తి తర్వాత తొలిసారి ఆయన వుహాన్‌కు వెళ్లారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. చైనా క్వారెంటైన్ హోటల్ కూలిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 20కి పెరిగింది. 61 మందిని శిథిలాల కింద నుంచి బయటకు తీశారు.