డయాబెటిస్ ఉంటే జర భద్రం

డయాబెటిస్ ఉంటే జర భద్రం
  • 230 మంది కరోనా మృతుల్లో
  • 120 మంది డయాబెటిస్ పేషెంట్లే
  • ఇతర వ్యాధులతో 70 మంది మరణం
  • ఏ జబ్బు లేకుండానే కన్నుమూసిన వారు 40 మంది
  • స్టేట్​లో 26 లక్షల మంది షుగర్‌‌‌‌, బీపీ రోగులు

హైదరాబాద్, వెలుగు: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ మహమ్మారితో చనిపోతున్న ప్రతి ఇద్దరిలో ఒకరు షుగర్ పేషెంటే. డయాబెటిస్ ఉన్నవాళ్లలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడంతో వైరస్ ఎఫెక్ట్​ ఎక్కువగా ఉంటోంది. బాడీలోని పార్ట్స్​పై వైరస్ త్వరగా ఎటాక్ చేస్తోందని, ఇందువల్లే పరిస్థితి విషమించి చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. స్టేట్​లో గురువారం నాటికి కరోనాతో 230 మంది చనిపోగా, ఇందులో 120 మందికి డయాబెటిస్ ఉంది. వీరిలో 88 మందికి డయాబెటిస్, హైపర్‌‌‌‌‌‌‌‌ టెన్షన్ రెండూ ఉండగా, 19 మందికి డయాబెటిస్ మాత్రమే ఉంది. ఇంకొందరికి డయాబెటిస్​కు తోడు ఇతర జబ్బులూ ఉన్నయి. ఒకటికి మించి రోగాలు ఉన్నవాళ్లు కరోనా సోకిన నాలుగైదు రోజుల్లోనే క్రిటికల్ పొజిషన్‌‌‌‌లోకి వెళ్తున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఆక్సిజన్ లెవల్స్‌‌‌‌ పడిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిస్​ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారు కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

26 లక్షల మందికి ముప్పు

హెల్త్​ డిపార్ట్​మెంట్​ లెక్కల ప్రకారం స్టేట్​లో 5.7 లక్షల మంది డయాబెటిస్​, 10.3 లక్షల మంది హైపర్‌‌‌‌‌‌‌‌ టెన్షన్ రోగులు ఉన్నారు. కొన్ని జిల్లాల్లో సర్వే పూర్తి కాకపోవడంతో అనధికారికంగా మరో పది లక్షల మంది వరకూ డయాబెటిస్​, హైపర్ టెన్షన్ రోగులు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. వీళ్లందరికీ కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నరు. అయితే, కరోనా సోకిన డయాబెటిస్​ రోగుల్లో చాలా మంది కోలుకుంటున్నారని గాంధీ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్లు వివరించారు. డయాబెటిస్​ రోగుల్లోనూ వృద్ధులు, ఒకటికి మించి జబ్బులు ఉన్నవాళ్లలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని అంటున్నారు.

ఇవి కూడా ప్రమాదమే

డయాబెటిస్​తో పాటు కేన్సర్‌‌‌‌‌‌‌‌, లంగ్, కిడ్నీ డిసీజ్‌‌‌‌, న్యూరాలజికల్ డిజార్డర్స్‌‌‌‌ ఉన్నవాళ్లలోనూ కరోనా డెత్ రేట్ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారిలో 33 మంది ఈ జబ్బులతో బాధపడే వారే. నాన్‌‌‌‌కమ్యునికబుల్ డిసీజెస్‌‌‌‌తో బాధపడేవారు లక్షణాలు మొదలైతే, వెంటనే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆలస్యం చేయడం వల్లే చాలా మంది విషయంలో పరిస్థితి చేయిదాటిపోతోందని అంటున్నారు. స్టేట్​లో కరోనా కారణంగా చనిపోయిన వారిలో 40 మందికి డయాబెటిస్​గానీ, ఇతర రోగాలుగానీ లేవు. ఇమ్యూనిటీ పవర్​ తక్కువగా ఉండడం, వైరస్ సోకిన తర్వాత హాస్పిటల్‌‌‌‌కు ఆలస్యంగా వెళ్లడం వంటివే వీరి మరణాలకు కారణాలని డాక్టర్లు వివరిస్తున్నారు. కరోనా తొలుత ఊపిరితిత్తులపై ప్రతాపాన్ని చూపుతోందని, ఇలాంటి వారిలో ఎక్కువగా న్యుమోనియాతో మరణిస్తున్నట్టు చెబుతున్నారు.

అమెరికా ఆగమాగం..తీవ్రత పెరిగిన కేసులు