కొన్ని పాత కార్లకు డ్యాష్ కెమెరాలు ఉండవు. అలాంటప్పుడు ఈ కెమెరాని బిగించుకుంటే సరిపోతుంది. దీన్ని ఐగాడ్జ్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ గాడ్జెట్‌లో మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. ముందు, వెనుక, సైడ్ ఇలా.. 360డిగ్రీల్లో అన్ని వైపులను క్యాప్చర్ చేస్తాయి. బ్లైండ్ స్పాట్లను తెలుసుకునేందుకు, ఊహించని యాక్సిడెంట్లను రికార్డ్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది.
ప్రయాణాల్లో ఉన్నప్పుడు రికార్డింగ్స్‌ని డౌన్‌లోడ్ చేయడానికి, చూసేందుకు లేదా షేర్ చేయడానికి కెమెరాని వైఫై ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ కెమెరా ఫుటేజీ ఫ్రూఫ్‌గా పనికొస్తుంది. ‘‘పిక్చర్ ఇన్ పిక్చర్’’కి కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే రికార్టింగ్‌తోపాటు ఫుటేజీ డిస్‌ప్లే కూడా అవుతుంది.
ఇందులో జీ -సెన్సర్ ఉంటుంది. ఇది ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యమైన క్లిప్‌లను ఆటోమెటిక్‌గా మెమొరీకార్డ్‌లో సేవ్ చేస్తుంది.
