హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. టాటా నగర్ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అగ్ని ప్రమాదం జరిగిన పరిశ్రమ వివరాలు:
శివానంద్ బ్రదర్స్ ప్లాస్టిక్ గ్రాయిన్ వర్క్స్.
manufacture.
Sy No 134/20
శాస్త్రిపురం టాటా నగర్.
మైలార్డెవపల్లి.
ఇదిలా ఉండగా.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు రిమాండ్కు తరలించారు. జూన్ 30వ తేదీన సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్టింగ్లో 54 మంది కార్మికుల మృతితో సిగాచీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసిన పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ రిమాండ్కు తరలించారు.
