క్వారంటైన్లో 25వేల మంది..అందరూ తబ్లిగికి లింక్ ఉన్న వాళ్లే

క్వారంటైన్లో 25వేల మంది..అందరూ తబ్లిగికి లింక్ ఉన్న వాళ్లే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ల సంఖ్య 4,757కి చేరింది. మంది చనిపోయిన వారి సంఖ్య 134కి పెరిగింది. మహారాష్ట్రలో  అత్యధికంగా 868 కేసులు నమోదు కాగా, 5 2 మంది చనిపోయారు. తమిళనాడులో 621 మందికి కరోనా సోకగా, ఐదుగురు మృతి చెందారు. దేశవ్యాప్తంగా 25,500 మందికి పైగా తబ్లి గిజమాత్ సభ్యులు, వారి కాంటాక్టులను క్వారంటైన్లో ఉంచినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెప్పింది. హర్యానా లోని ఐదు గ్రామాలను పూర్తిగా సీల్ చేశామని, తబ్లి గి సభ్యులు అక్కడ కొన్ని రోజులు ఉండటంతో గ్రామాల్లోని ప్రజలందరినీ క్వారంటైన్లో ఉంచామని హోం మినిస్ర్టీ జాయింట్ సెక్రెటరీ పుణ్య సలీల శ్రీవాస్తవ చెప్పారు. 1,750 మంది ఫారిన్ జమాత్ సభ్యులను బ్లాక్ లిస్ట్లో ఉంచినట్లు తెలిపారు.

63 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వాళ్లే

కరోనా మృతుల్లో 63 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వాళ్లని హెల్త్ మినిస్ట్రీ అధికారులు చెప్పారు. మొత్తం మృతుల్లో 73 శాతం మంది పురుషులు, 27 శాతం మంది మహిళలు ఉన్నారని చెప్పారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో కనీసం 1450 కేసులు తబ్లి గి జమాత్ ఈవెంట్ కు  సంబంధించినవేనని తెలిపారు. ఇప్పటివరకు 109 మంది చనిపోయారని, ఒక్క ఆదివారమే 30 మంది మృతి చెందారన్నారు. ఆదివారం నుంచి కొత్తగా 693 కేసులు నమోదయ్యాయని, 30 మంది చనిపోయారని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.

5 లక్షల కిట్లు ఆర్డర్ చేశాం..

కరోనా బాధితుల విషయంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ సమర్ధతపై పూర్తి ఆధారాలు లేవని, దాన్ని వాడమని ప్రజలకు అడ్వైజ్ చేసేందుకు రుజువులు లేవని ఐసీఎంఆర్ అధికారులు చెప్పారు. కరోనా హాట్ స్పాట్స్ లో  పరీక్షలు జరిపేందుకు 5 లక్షల ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్లను ఆర్డర్ చేశామని తెలిపారు.

ఇంకొన్ని పాయింట్స్

కరోనాపై పోరాటం చేసేందుకు అమెరికా ప్రభుత్వం ‘యూఎస్ఎయిడ్’ ఏజెన్సీ ద్వారా 2.9 మిలియన్ డాలర్ల (రూ.22కోట్లు) ఇండియాకు ప్రకటించింది. ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ 50 లక్షల ఎంపీ లాడ్ నిధులను ఢిల్లీ ప్రభుత్వానికి ఆఫర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్విందర్ సింగ్ సుఖు.. 35 లక్షల ఎమ్మెల్యే ఫండ్స్ ను  కరోనా టెస్టిం గ్ మిషన్లకోసం ప్రకటించారు. ట్రావెల్ హిస్టరీ లేకున్నా అహ్మదాబాద్ లో  14 నెలల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. 55 సంస్థలు రోజుకు77 వేల లీటర శానిటైజర్లను తయారు చేస్తున్నాయని యూపీ వెల్లడించిం ది. లాక్డౌన్, సోషల్, డిస్టెన్స్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఒడిశాలోని కటక్, భువనేశ్వర్లో సుమారు 900 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. హర్యానాలోని కర్నాల్లో ఓ ఆస్పత్రిలో ఉన్న 55 ఏళ్ల కరోనా అనుమానిత పేషెంట్.. తప్పించుకు నేందుకు ప్రయత్నిం చాడు. ఈ క్రమంలో ఆరో ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయాడు. స్టూడెంట్లకోసం మెంటల్ హెల్స్ లైన్స్ కోసం ఏర్పాటు చేయాలని అన్ని యూనివర్సిటీలు, కాలే జీలను యూజీసీ ఆదేశించింది.