హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం (నవంబర్ 5) షేక్ పేట్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రులు వివేక్ వివేక్, అజారుద్దీన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌కు చేసేందేమి లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.200 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇందులో 70 శాతం డెవలప్మెంట్ వర్క్స్ పూర్తి అయ్యాయని చెప్పారు. పిలిస్తే పలికే యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.
