శ్రీశైలంలో జ్వాల తోరణోత్సవం..ఆధ్యాత్మికతతో నిండిన కార్తీక పౌర్ణమి

శ్రీశైలంలో జ్వాల తోరణోత్సవం..ఆధ్యాత్మికతతో నిండిన కార్తీక పౌర్ణమి

పరమశివుడి పుణ్యక్షేత్రం శ్రీశైలం‌లో కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా జ్వాల తోరణోత్సవం జరిగింది.  ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి. మంగళవారం (నవంబర్​5) కార్తీక పౌర్ణమి రోజున భారీ ఎత్తున్న భక్తులుతరలివచ్చారు. తెల్లవారుజామున నుంచే శ్రీ బ్రహ్మారాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం భారీ బారులు తీరారు. ఆలయ ప్రాంగణం హర హర మహాదేవ్, ఓం నమః శివాయ శివనామస్తుతులతో మారుమ్రోగింది.

మంగళవారం సాయంత్రం గంగాధర మండపం దగ్గర శ్రీశైల మల్లన్నకు జ్వాల తోరణోత్సవం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్​ రెడ్డి, ఆలయ చైర్మన్ రమేష్​ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. జ్వాల తోరణోత్సవాన్ని తిలకించేందుకు  వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ  మల్లికార్జున స్వామి వారికి  దశ విధ హారతులు సమర్పించారు అర్చకులు.