తెలంగాణలో నేడు (నవంబర్ 5) స్కూల్స్, కాలేజీలకు సెలవు.. బ్యాంకులు కూడా బంద్ !

తెలంగాణలో నేడు (నవంబర్ 5) స్కూల్స్, కాలేజీలకు సెలవు.. బ్యాంకులు కూడా బంద్ !

హైదరాబాద్: నవంబర్ 5న బ్యాంకులకు సెలవు. గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని.. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు బుధవారం, నవంబర్ 5, 2025 రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియ సెలవు ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం.. తెలంగాణ, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అయితే.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

ఇక.. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు ఇప్పటికే బంద్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో.. ప్రైవేట్ కాలేజీలు కూడా లేనట్టే.

ఇలా తెలంగాణలో.. స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు బుధవారం సెలవు కావడం గమనార్హం. బ్యాంకుల్లో పనులు పెండింగ్లో ఉన్న వాళ్లు ఈ విషయాన్ని గమనించి గురువారం బ్యాంకులకు వెళ్లడం మేలు.