కరోనా సూట్స్ ఉన్నయ్.. టెన్షన్ అక్కర్లేదు

కరోనా సూట్స్ ఉన్నయ్.. టెన్షన్ అక్కర్లేదు

పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ)లకు కొరత లేదని, దీనిపై వచ్చే రూమర్లను  నమ్మొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.కొరత లేక పోయినా పీపీఈలను పొదుపుగా వాడాలని హెల్త్ వర్కర్లకు  సూచించారు. దేశంలోని 20 కంపెనీలు పీపీఈలను తయారు చేస్తున్నాయని వివరించారు. ఈ కంపెనీలకు ఇప్పటికే 1 కోటి 70 లక్షల పీపీఈలకు ఆర్డర్  పెట్టినట్లు తెలిపారు. దీంతో
పాటు 49 వేల వెంటిలేటర్లకు ఆర్డర్ పెట్టామని త్వరలో అవి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కరోనా స్పెషలిస్టులతో 10 టీంలను ఏర్పాటు చేసి రాష్ట్రా లకు పంపించినట్లు వివరించారు. ఇండియన్ రైల్వే 6 లక్షల ఫేస్ మాస్క్ లు (రీయూజబుల్)లు, 4 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్లను  తయారు చేసిందని అగ్వరాల్ చెప్పారు.   రైలు కోచ్ లను ఐసోలేషన్ వార్డ్ లుగా మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటి  వరకు3,250  కోచ్ లు   ఏర్పాట్లు పూర్తయ్యాయనివి వరించారు.

బుధవారం దేశవ్యాప్తంగా 540 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 17 మంది మరణించారని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,734 కు చేరుకుందని, వైరస్ కారణంగాఇప్పటివరకు166 మంది చనిపోయారని చెప్పారు. ఐసీఎంఆర్అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు1లక్ష 30వేల శాంపిల్స్ ను సేకరించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామన్నారు.

హైడ్రాక్సిక్లోరోక్విన్  స్టాక్…

కరోనా ట్రీట్ మెంట్ లో మంచి ఫలితాలనిస్తున్న మలేరియా మందు హైడ్రాక్సిక్లోరోక్విన్ నిల్వలు తగినన్ని ఉన్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు.
భవిష్యత్తు అవసరాలకు కూడా సరిపోయేలా నిల్వచేశామన్నారు.అయితే,ఈ మందును ఎవరికి పడితే వారికి అమ్మొద్దనిచెప్పారు. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లకు  మాత్రమే ఇవ్వాలన్నారు.