V6 News

‘గురుకులాల్లో అవినీతిపై దర్యాప్తు జరపాలి’: బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు

‘గురుకులాల్లో అవినీతిపై దర్యాప్తు జరపాలి’: బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు

బషీర్​బాగ్​, వెలుగు: బీసీ గురుకులల్లో అవినీతి జరుగుతోందని, కేంద్ర సంస్థల ద్వారా దర్యాప్తు చేపట్టాలని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ జాతీయ బీసీ కమిషన్‌‌‌‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కమిషన్ కార్యదర్శి, పర్సన్ ఇన్‌‌‌‌చార్జి మీత రాజీవ్ లోచన్‌‌‌‌కు ఆయన ఫిర్యాదు చేశారు. జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.సైదులు పర్యవేక్షణ లోపం వల్ల అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు.

పీఎం శ్రీ నిధుల కింద మంజూరైన రూ.20 కోట్లు అవినీతికి గురయ్యాయన్నారు. దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కుడికాల భాస్కర్, విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్, జిల్లాల అధ్యక్షులు వడ్నాల రవీందర్, ఊర్లగోండ మురళి, బొంగోని అభిలాశ్, వరాల అనిల్, ఉట్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.