భారీ వర్షానికి పత్తి చేనంతా మునిగింది

భారీ వర్షానికి పత్తి చేనంతా మునిగింది

రఘునాథపల్లి, వెలుగు: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులు ఆగడంతో, భారీ వర్షానికి పత్తి చేనంతా మునిగింది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూర్ నుంచి దేవరుప్పుల మండలం రాంచంద్రాపురం వరకు గతేడాది పీఎం సడక్ యోజన కింద బీటీ రోడ్డు మంజూరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే రాజయ్య పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ రోడ్డు వెంట ఉన్న పాత కల్వర్టులను మట్టితో పూడ్చాడు. రెండు కిలోమీటర్ల మేర మట్టి పోసి, పనులు ఆపాడు. దీంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పత్తి చేన్లు నీట మునిగాయి. వాహనదారులు సైతం రోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.