అక్రమ కూల్చివేతలకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న కౌన్సిలర్

అక్రమ కూల్చివేతలకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న కౌన్సిలర్

మేడ్చల్: అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ అధికారులను.. జేసీబీ బకెట్ లో కూర్చొని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అడ్డుకున్న ఘటన మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గుండ్ల పోచంపల్లిలోని సర్వే నెంబర్ 40, 51, 52, 53 గల మొత్తం 10 ఎకరాల స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు విల్లాస్ నిర్మించారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా గోడ నిర్మించారనే కారణంతో మునిసిపల్ అధికారులు  ఆ గోడను కూలగొట్టేందుకు వెళ్లారు. అయితే మునిసిపల్ అధికారులను టీఆర్ఎస్ కు చెందిన స్థానిక కౌన్సిలర్ వాణి అడ్డుకున్నారు. జేసీబీ బకెట్ లో కూర్చొని నిరసన తెలిపారు. దీంతో అధికారులు, కౌన్సిలర్ మధ్య వాగ్వివాదం జరిగింది. తనకు చెప్పకుండా నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారంటూ కౌన్సిలర్ మునిసిపల్ అధికారులతో గొడవకు దిగారు. అక్రమ గోడ నిర్మాణ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని అధికారులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

మరిన్ని వార్తల కోసం:

ఈ స్థాయిలో రిజర్వేషన్.. రాజ్యాంగ విరుద్ధం

‘రతన్ టాటాకు భారతరత్న’ పిల్ ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు