ఈ ఏడాది నీట్‌‌ పీజీ ఎగ్జామ్ రాసిన వాళ్లందరికీ కౌన్సెలింగ్‌‌

ఈ ఏడాది నీట్‌‌ పీజీ ఎగ్జామ్ రాసిన వాళ్లందరికీ కౌన్సెలింగ్‌‌

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది నీట్‌‌ పీజీ ఎగ్జామ్ రాసిన వాళ్లందరికీ కౌన్సెలింగ్‌‌లో పాల్గొనే అవకాశం ఇస్తున్నట్టు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) ప్రకటించింది. కేంద్ర ఆరోగ్యశాఖ తీసుకున్న సూచన మేరకు, కట్ ఆఫ్ స్కోర్‌‌‌‌ను జీరోగా నిర్ణయించామని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏటా సుమారు వెయ్యికి పైగా పీజీ సీట్లు వేకెంట్ ఉంటున్నాయి. ఇందులో నాన్ క్లినికల్, పారా క్లినికల్ సీట్లే అత్యధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కట్ ఆఫ్ తగ్గిస్తే, ఆ సీట్లన్నీ నిండుతాయని కేంద్ర ఆరోగ్యశాఖకు ఐఎంఏ ఓ లేఖ రాసింది.

Also Read : అక్టోబర్ 4న ఖమ్మం జిల్లా ఓటర్ల తుది జాబితా

కట్ ఆఫ్ తగ్గించడం వల్ల నష్టం లేదని, పీజీ కోసం ఎదురుచూస్తున్న డాక్టర్లకు మేలు జరుగుతుందని కోరింది. కాగా, కొత్త కట్ ఆఫ్ నేపథ్యంలో కౌన్సెలింగ్‌‌లో పాల్గొనదల్చుకున్న స్టూడెంట్స్‌‌ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సూచించింది. ఆల్‌‌ ఇండియా కోటా మూడో రౌండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎంసీసీ తెలిపింది.