పీజీ, పీహెచ్డీ కోర్సులకు 19న పీజీటీఏయూలో కౌన్సెలింగ్‌

పీజీ, పీహెచ్డీ కోర్సులకు 19న పీజీటీఏయూలో కౌన్సెలింగ్‌

గండిపేట,వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్​ యూనివర్సిటీలో 2025–-26 విద్యా సంవత్సరానికి గాను పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్​కు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించింది. పూర్తి వివరాలకు www.pjtau.edu.in వెబ్​సైట్​లో చూడవచ్చని పేర్కొంది.