ఉగ్రవాద నిర్మూలనకు దేశాలన్ని ఉమ్మడిగా పోరాడాలి : జైశంకర్

ఉగ్రవాద నిర్మూలనకు దేశాలన్ని ఉమ్మడిగా పోరాడాలి : జైశంకర్

భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కూడా న్యూయార్క్ లో బిజీబిజీగా ఉన్నారు. గల్ఫ్  కో ఆపరేషన్  కౌన్సిల్ .. జీసీసీ  సమావేశంలో  ఆయన  పాల్గొన్నారు. జీ4 దేశాలైన  జపాన్, జర్మనీ, బ్రెజిల్ విదేశాంగ శాఖ మంత్రుల మీటింగ్ కు హాజరయ్యారు. కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు జైశంకర్. ఉగ్రవాదం ప్రపంచానికి పెద్ద ముప్పుగా  మారిందన్నారు.

ఉగ్రవాద నిర్మూలనకు  దేశాలన్ని ఉమ్మడిగా  పోరాడాల్సిన  అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని  ప్రోత్సహిస్తున్న పొరుగు  దేశంతో  తాము ఎలా చర్చలు జరుపుతామని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఆర్టికల్  370 రద్దుతో  కశ్మీర్ ప్రజలకు  స్వేచ్ఛ వచ్చిందన్నారు జైశంకర్. ఆగస్టు 5 కశ్మీర్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.