న్యూఢిల్లీ: ఎకానమీ డిజిటలైజేషన్, క్రిప్టో, స్టేబుల్‌కాయిన్స్ వంటి కొత్త ఆర్థిక ఉత్పత్తుల వల్ల పుట్టుకొస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా సమన్వయ చర్యలు అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 18వ గ్లోబల్ ఫోరం ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన ఆమె, పన్ను సమాచారాన్ని దేశాల మధ్య సమయానికి పంచుకోవడానికి ఏఐ వంటి టెక్నాలజీలను వాడుకోవాలని పేర్కొన్నారు.
రెవెన్యూ సెక్రటరీ అర్వింద్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, డేటా గోప్యతా వ్యవస్థలు బలంగా ఉండాలని, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పంచుకున్న సమాచారాన్ని సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. గ్లోబల్ ఫోరంలో 170 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
