ఫారిన్​ ట్రావెలర్లకు టూరిజం గేట్లు తెరుస్తున్న దేశాలు

ఫారిన్​ ట్రావెలర్లకు టూరిజం గేట్లు తెరుస్తున్న దేశాలు
  • టూర్​లో కరోనా వస్తే ఖర్చంతా భరించేందుకు సిప్రస్​ రెడీ
  • 100 బెడ్లతో టూరిస్టుల కోసం స్పెషల్​ ఆస్పత్రి
  • 14 రోజుల క్వారంటైన్​ రూల్​ పెట్టిన ఫ్రాన్స్​, బ్రిటన్​, గ్రీక్​
  • పోర్చుగల్​ ‘డోంట్​ క్యాన్సిల్​, పోస్ట్​పోన్​’ స్కీమ్​
  • చార్టర్​ ఫ్లైట్స్​ ల్యాండింగ్​ చార్జీలు రద్దు చేసిన మాల్దీవ్స్​

ప్యారిస్​లో ఐఫిల్​ టవర్​ చూడాలని ఎవరికుండదూ.. వెనిస్​ నగర అందాలను కళ్లల్లో దాచి పెట్టుకోవాలని ఎవరనుకోరూ.. మాల్దీవ్స్​లో సరదాగా గడపాలని ఎంతమందికి ఉండదు..! అలా ప్రపంచాన్ని చుట్టేసి రావాలని అనుకునేటోళ్లను కరోనా ఇళ్లలోనే కట్టిపడేసింది. ఎటూ వెళ్లకుండా లాక్​ చేసేసింది. ఇటు టూరిజం మీదే ఎక్కువ సంపాదించే దేశాలనూ దెబ్బ కొట్టింది. కొన్ని దేశాల ఎకానమీపై అది పెద్ద దెబ్బే వేసింది. అందుకే కొన్ని దేశాలు మళ్లీ టూరిస్టులకు వెల్​కమ్​ చెప్పాలని అనుకుంటున్నాయి. చిన్న చిన్నగా డోర్లు తెరవాలని చూస్తున్నాయి. గాడి తప్పిన ఎకానమీని టూరిజం బాట పట్టించాలని భావిస్తున్నాయి. కరోనా ప్రభావం ఇంకా పోకపోయినా దాని నుంచి కాపాడుకుంటూనే ఎకానమీని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాయి.

ఫ్రాన్స్​లో 14 రోజుల క్వారంటైన్​ తప్పనిసరి

కరోనా ఎఫెక్ట్​ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్​ది ఆరో స్థానం. మహమ్మారి ప్రారంభమైన మొదటి నుంచి ఆ దేశంపై దాని ప్రభావం ఎక్కువగానే ఉంది. కరోనాకు ముందు ప్రపంచంలో టూరిస్టులు ఎక్కువ టూర్​ వేసిన దేశంగా ఫ్రాన్స్​ ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. కానీ, కరోనాతో అంతా తారుమారైపోయింది. దీంతో మళ్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్​ ట్రావెలర్లకు ఆ దేశం బార్డర్లు తెరుస్తోంది. ఇప్పటికే దేశ ప్రజలు వంద కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేందుకు వీలు కల్పించింది. మిగతా దేశాల నుంచి వచ్చే టూరిస్టులకూ త్వరలోనే అనుమతి ఇవ్వనుంది. అయితే, ఈయూ (యూరోపియన్​ యూనియన్​) దేశాలు, బ్రిటన్​ మినహా వేరే దేశాల నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్​లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇక, దేశంలో టూరిస్టులు ఎక్కువగా వెళ్లిన లూవర్​ మ్యూజియంను జులై 6 నుంచి ఓపెన్​ చేస్తామని మే 29న ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి ఫ్రాన్స్​ ప్రజలంతా హాలిడే ట్రిప్పులకు వెళ్లొచ్చని చెప్పింది.

కరోనా వస్తే ఖర్చంతా సిప్రస్​దే

వీలైనంత తొందరగా టూరిజం ఇండస్ట్రీని ఓపెన్​ చేయాలని సిప్రస్​ భావిస్తోంది. అంతేకాదు, వేరే దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు దేశంలో కరోనా వస్తే.. మొత్తం ఖర్చులను ఆ దేశ ప్రభుత్వమే భరించనుంది. లాడ్జింగ్​ నుంచి డ్రింక్స్​, మందులను ఉచితంగా అందించనుంది. ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ను ఇప్పించనుంది. వాళ్ల కోసం ప్రత్యేకంగా వంద బెడ్ల ఆస్పత్రిని కూడా సిద్ధం చేసింది. వాళ్ల కాంటాక్ట్స్​, ఫ్యామిలీని క్వారంటైన్​ చేసేందుకు 500 గదులతో ఓ హోటల్​నూ సిద్ధం చేసింది. ఒక్క విమాన చార్జీలను మాత్రమే సదరు ట్రావెలర్​ భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 1నే హోటళ్లను తెరిచిన ఆ దేశం, 9వ తేదీ నుంచి ఇంటర్నేషనల్​ ట్రావెల్​ను ఓపెన్​ చేయనుంది. అయితే, దశలవారీగా వివిధ దేశాలకు ఓకే చెప్పనుంది. కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న అమెరికా, బ్రిటన్​ వంటి దేశాల వాళ్లకు మాత్రం నో చెప్పేస్తోంది.

జూన్​ 15 నుంచి గ్రీక్​ ఓపెన్​

గ్రీక్​ జీడీపీలో టూరిజం వాటా 20 శాతం. ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకటి టూరిజంలోనే. కానీ, కరోనా దెబ్బతో ఎక్కడికక్కడ అది ఆగిపోయింది. ఎకానమీ నష్టపోయింది. దీంతో వీలైనంత తొందరగానే టూరిజం సెక్టార్​ను ఓపెన్​ చేయాలని ఆ దేశం నిర్ణయించింది. వీలైతే జూన్​ 15 నుంచే ఓపెన్​ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. మే 20న టూరిజం గురించి మాట్లాడిన ఆ దేశ ప్రదాని కైరియోకస్​ మిషోతాకిస్​.. దేశంలో టూరిజం టైం జూన్​ 15 నుంచి మొదలవుతుందని, అప్పుడే హోటళ్లన్నీ తెరవొచ్చని ఓ హింట్​ ఇచ్చారు. అయితే, అది కేవలం దేశ ప్రజల వరకు మాత్రమే. ఇంటర్నేషనల్​ ఫ్లైట్స్​ను జులై 1 నుంచి మళ్లీ మొదలుపెడతామని ఆయన చెప్పారు. అది కూడా కేవలం 29 దేశాల వాళ్లకే పర్మిషన్​ అన్నారు. వచ్చినోళ్లంతా ముందు 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాల్సిందేనన్న రూల్​ కూడా పెట్టారు.

మాల్దీవుల్లో టూరిస్ట్​ వీసా ఫీజు రద్దు​

వెయ్యికిపైగా దీవులు కలిసిన ఐలాండ్​ దేశం మాల్దీవ్స్​. టూరిజంపైనే ఆ దేశం ఆధారపడింది. కరోనాతో మూతపడిన ఆ దేశంలో టూరిజాన్ని ఈ ఏడాది చివరి నాటికి ఓపెన్​ చేయాలని ఆ దేశ సర్కార్​ భావించింది. కానీ, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విడతల వారీగా ఓపెన్​ చేస్తోంది. ఇప్పటికే జూన్​ 1న సూపర్​యాట్​లు, జెట్​లను అనుమతించింది. జులై నుంచి అన్ని దేశాల టూరిస్టులూ వచ్చేందుకు ఓకే చెప్పేసింది. ఇప్పటిదాకా చార్టర్​ ఫ్లైట్స్​, ప్రైవేట్​ జెట్లు ల్యాండ్​ అయ్యేందుకు వేస్తున్న 50 వేల డాలర్ల చార్జ్​ను ఆ దేశం రద్దు చేసింది. టూరిస్ట్​ వీసా ఫీజునూ రద్దు చేసింది. ఎలాంటి అదనపు చార్జీలనూ టూరిస్టుల మీద రుద్దబోమని అధికారులు చెప్పారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో టూరిస్ట్​ ఫెసిలిటీలకు సేఫ్​ టూరిజం లైసెన్స్​లనూ ఇవ్వనుంది. ఆయా సంస్థలు సేఫ్టీ చర్యలు తీసుకునేలా చట్టం చేసింది. ప్రతి టూరిస్ట్​ సంస్థ ఓ డాక్టర్​ను ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలని, పీపీఈ కిట్లను తగినన్ని ఉంచుకోవాలని ఆదేశించింది. నిరుడు 17 లక్షల మంది టూరిస్టులు రాగా, ఈ ఏడాది 20 లక్షల మంది వస్తారన్న అంచనా ఉంది.

మరిన్ని దేశాల్లో ఇలా…

  • జూన్​ 15 నుంచి యూరప్​ కంట్రీస్​కు బార్డర్లు తెరవనుంది జర్మనీ. టర్కీ, బ్రిటన్​, ఐస్లాండ్​, నార్వే, స్విట్జర్లాండ్​ వంటి దేశాలకూ అనుమతివ్వనుంది
  • జూన్​ 3 నుంచే బ్రిటన్​ సహా యూరప్​ దేశాలకు ఓకే చెప్పింది ఇటలీ. కొన్ని దేశాలు క్వారంటైన్​ రూల్​ పెడుతున్నా.. ఇటలీ మాత్రం అలాంటిదేమీ అవసరం లేదని చెప్పింది.
  • జులై 1 నుంచి టూరిస్టులకు స్పెయిన్​ అనుమతి ఇవ్వనుంది.
  • జూన్​ 15 తర్వాత విదేశీ టూరిస్టులకు గేట్లు ఓపెన్​ చేయాలని పోర్చుగల్​ భావిస్తోంది. అందులో భాగంగా ‘డోంట్​ క్యాన్సిల్​, పోస్ట్​పోన్​’ స్కీమ్​ను ప్రారంభించింది. ఇప్పటికే బుక్​ చేసుకున్న టూర్​లను 2021 చివరి వరకు ఎప్పుడైనా రీషెడ్యూల్​ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
  • జూన్​ 4 నుంచి కరీబియన్​ దీవుల్లో ఒకటైన సెయింట్​ లూసియా జూన్​ 4 నుంచి టూరిజం గేట్లు తెరిచింది. అయితే, వివిధ దేశాల నుంచి వచ్చేటోళ్లు ఫ్లైట్​ ఎక్కడానికి 48 గంటలకు ముందు కచ్చితంగా కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్​ను ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది.
  • టూరిస్టుల కోసం హోటళ్లు ఓపెన్​ చేయాలంటే రెసిడెంట్​ డాక్టర్​తో ఓ క్లినిక్​ను ఏర్పాటు చేయాల్సిందేనన్న రూల్​ పెట్టింది ఈజిప్ట్​. జులై మొదటి వారం నుంచి ఇంటర్నేషనల్​ ఫ్లైట్లకు అనుమతిచ్చే అవకాశాలున్నాయి.
  • జూన్​8 నుంచి ట్రావెలర్లను అనుమతించనుంది బ్రిటన్​. ఇంటర్నేషనల్​ టూరిస్టులందరికీ 14 రోజుల క్వారంటైన్​ను తప్పనిసరి చేసింది. అందుకు ఆ ట్రావెలర్​ డిక్లరేషన్​ను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రూల్స్​ బ్రేక్​ చేస్తే 1,218 డాలర్ల ఫైన్​ వేయనుంది.
  • అక్టోబర్​ నుంచి టూరిస్టులకు గేట్లు ఓపెన్​ చేయాలని బాలి నిర్ణయించింది. అయితే, విదేశాల నుంచి వచ్చేటోళ్లకు ఎలాంటి షరతులు పెట్టబోయేది మాత్రం చెప్పలేదు.
  • ఈ ఏడాది చివరి క్వార్టర్​ నాటికి పర్యాటకానికి అనుమతి ఇవ్వాలని థాయ్​లాండ్​ భావిస్తున్నా.. అప్పటికి కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. కరోనా తీవ్రంగా ఉన్న దేశాల నుంచి మాత్రం టూరిస్టులకు నో అనేస్తోంది. టూరిస్టులు మారుమూల ప్రాంతాల టూర్​కు వెళ్తే లాంగ్​స్టే ప్యాకేజీలను ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగైతే వాళ్ల ఆరోగ్యాన్ని ఈజీగా మానిటర్​ చేయొచ్చని చెబుతున్నారు.