హైదరాబాద్, వెలుగు: కంట్రీ క్లబ్ ‘వీఐపీ ఇంటర్నేషనల్ 24’ మెంబర్షిప్ కార్డును గురువారం లాంచ్ చేసింది. అంతర్జాతీయంగా పేరొందిన టూరిజం ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారి కోసం ఈ కార్డును తీసుకొచ్చామని కంపెనీ చైర్మన్ వై రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. కంట్రీ క్లబ్ వీఐపీ మెంబర్లను దక్షిణాసియా దేశాలలోని - థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా , బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్, బాలి, హనోయి వంటి డెస్టినేషన్లకు పంపుతామని, ఉచితంగా 7 రాత్రులు , 8 రోజులు గడపొచ్చని చెప్పారు. మెంబర్లు, గెస్ట్ సభ్యులను అలరించే విధంగా పలు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు చేపడతామని అన్నారు.