రాష్ట్రంలోని పల్లెల్లో ఒక్కొక్కరి హాస్పిటల్ ఖర్చు
ఏటా రూ.13,968 పట్టణాల్లో రూ. 26,092కు పెరిగిన ఖర్చు
దేశవ్యాప్తంగా పల్లెల్లో రూ.16,956, పట్టణాల్లో రూ.26,455
గ్రామాల్లో 24.9% మంది అప్పులు చేస్తున్నరు
రాష్ట్రంలో 13,130 మందికి కేన్సర్ ‘నేషల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక’ విడుదల
దేశవ్యాప్తంగా హాస్పిటల్ ఖర్చుల కోసం నేటికీ లక్షల మంది ఆస్తులు అమ్ముకుంటున్నారు. కోట్లాది మంది పేదలు తలకు మించిన భారం
మోస్తూ ఏటా వేలాది రూపాయలను హాస్పిటల్స్ లో ట్రీట్ మెం ట్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న
ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున రూ.13,968 ఖర్చు చేస్తు న్నారని సెంట్రల్ హెల్త్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. రాష్ట్రంలోని పట్టణ వాసులు ఒక్కొక్కరు ఏటా రూ.26,092 హాస్పిటల్ ఖర్చులకు వెచ్చిస్తు న్నట్లు తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019’ నివేదికను తాజాగా ఢిల్లీలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పల్లె ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుం టే ఒక్కో వ్యక్తి సగటున రూ.16,956 హాస్పిటల్ ఖర్చులకు వెచ్చిస్తుం డగా, పట్టణాల్లో రూ.26,455 ఖర్చు చేస్తు న్నట్టు నివేదిక పేర్కొంది.
డెలివరీ ఖర్చులు పెరిగినయ్
దేశంలో డెలివరీ ఖర్చు కూడా పెరిగిపోయిందని నివేదిక వెల్లడించిం ది. సగటున ఒక డెలివరీకి గ్రామీణ ప్రాంతంలో సగటున రూ.5544, పట్టణ
ప్రాంతాల్లో రూ.11685 ఖర్చు అవుతోంది. ప్రైవేటు హాస్పిటళ్లలో అయితే, గ్రామీణ ప్రాంతాల్లో సగటున రూ.14,778, పట్టణ ప్రాంతాల్లో అయితే, సగటున రూ.20,328 డెలివరీ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది.
దేశానికి హైపర్ టెన్షన్
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేయిస్తున్న నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ సర్వేలో లక్షల మందికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉన్నట్టు తెలుస్తోం ది.
2018లో 6,51,94,599 మందికి పరీక్షలు చేయగా ఇందులో 3102186 మందికి డయాబెటిస్, 4038166 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో 2018లో 28,50,666 మందిని స్ర్కీన్ చేయగా1,22,456 మందికి డయాబెటిస్, 1,43,118 మందికి హైపర్ టెన్షన్
ఉన్నట్టు తేలిం ది. దేశవ్యాప్తంగా1,68,122 మందికి కేన్సర్ సోకినట్టు సర్వేలో తేలగా, ఇందులో తెలంగాణ నుంచి13,130 మంది ఉన్నారు.

