తగ్గిన రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌.. పెరిగిన ఇండస్ట్రీల ప్రొడక్షన్‌‌

తగ్గిన రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌.. పెరిగిన ఇండస్ట్రీల ప్రొడక్షన్‌‌

న్యూఢిల్లీ: దేశ రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ (సీపీఐ) కిందటి నెలలో 5.02 శాతంగా  (యాన్యువల్ బేసిస్‌‌) రికార్డయ్యింది. ఈ ఏడాది ఆగస్టులో నమోదైన 6.83 శాతం నుంచి దిగొచ్చింది. ఆహార పదార్ధాల ఇన్‌‌ఫ్లేషన్ ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో  6.56 శాతంగా రికార్డయ్యింది. అంతకు ముందు నెలలో ఇది 9.94 శాతంగా ఉంది.  రూరల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ సెప్టెంబర్‌‌‌‌లో 5.33 శాతంగా, అర్బన్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ 4.65 శాతంగా నమోదయ్యాయి. కూరగాయల ధరలు బాగా  తగ్గాయి. 

దీంతో వెజిటబుల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌  ఆగస్టులోని 26.14 శాతం నుంచి సెప్టెంబర్‌‌‌‌లో 3.39 శాతానికి దిగొచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇన్‌‌ఫ్లేషన్ తగ్గుతుందని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌‌ గతంలో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ 6.6 శాతంగా ఉంటుందని, డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో 5.5 శాతానికి తగ్గుతుందని ఆర్‌‌‌‌బీఐ  ఎంపీసీ అంచనావేసింది. 

ఐఐపీ జూమ్‌‌

ఈ ఏడాది ఆగస్టులో  దేశ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌‌ (ఐఐపీ) 10.3 శాతం పెరిగింది. అంతకు ముందు నెలలో 5.7 శాతం గ్రోత్ నమోదు చేసింది. కిందటేడాది ఆగస్టులో ఐఐపీ 0.7 శాతం తగ్గింది. ఈ ఏడాది ఆగస్టులో మైనింగ్ సెక్టార్‌‌‌‌లో ప్రొడక్షన్‌‌ 12.3 శాతం పెరగగా, మాన్యుఫాక్చరింగ్‌‌ సెక్టార్ ప్రొడక్షన్‌‌ 9.3 శాతం, ఎలక్ట్రిసిటీ  ప్రొడక్షన్‌‌ 15.3 శాతం పెరిగాయి. 

యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ 3.7%.. 

యూఎస్‌‌లో రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ కిందటి నెలలో  3.7 శాతానికి (యాన్యువల్ బేసిస్‌‌) పెరిగింది.  మార్కెట్ అంచనా కంటే ఇది ఎక్కువగా ఉంది.  నెల ప్రాతిపదికన  ఇన్‌‌ఫ్లేషన్‌‌  ఆగస్టులో 0.6 శాతం పెరగగా,  సెప్టెంబర్‌‌‌‌లో 0.4 శాతమే పెరిగింది.  కోర్ ఇన్‌‌ఫ్లేషన్ కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో 4.3 శాతంగా రికార్డయ్యింది. కిందటి నెలలో 4.1 శాతానికి తగ్గింది.