బైక్ లు చోరీ చేస్తున్న దంపతులు అరెస్ట్.. ఆరు వాహనాలు స్వాధీనం

బైక్ లు చోరీ చేస్తున్న దంపతులు అరెస్ట్.. ఆరు వాహనాలు స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: గవర్నమెంట్​హాస్పిటళ్లు టార్గెట్​గా వరుస బైక్​చోరీలకు పాల్పడుతున్న దంపతులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్​చేశారు. ఆలేరు మండలానికి చెందిన కోటగిరి వినోద్, పావని దంపతులు. వీరికి మద్యం, సిగరెట్ అలవాటు ఉంది. సులువుగా డబ్బులు సంపాదించాలనుకొని ప్లాన్​వేశారు. 

గాంధీ హాస్పిటల్​సహా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రభుత్వ దవాఖానల వద్ద పార్క్‌‌‌‌ చేసిన బైక్‌‌లను ఎత్తుకెళ్తున్నారు. గత నెల 20న గాంధీ దవాఖానలో నిలిపిన ద్విచక్రవాహనాన్ని చోరీచ చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించారు.

] బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీలు చేస్తున్నట్లు వారు ఒప్పుకోవడంతో 6 బైక్‌‌లు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్​చేశారు. కేసును ఛేదించిన సీఐ అనుదీప్, డీఐ రమేశ్​గౌడ్, ఎస్సై రాకేశ్​ను ఈస్ట్‌‌ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్​డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్‌‌రెడ్డి అభినందించి, రివార్డులు అందజేశారు.