ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగిన భార్యాభర్తలు

V6 Velugu Posted on Sep 14, 2021

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. యాదయ్య,యాదమ్మ అనే భార్యభర్తలు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య యాదమ్మ ఒక గదిలో గడియ పెట్టుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత యాదయ్య కూడా మరో గదిలో పురుగుల మందు తాగాడు. ఇది గమనించి స్థానికులు తలుపులు విరగొట్టి 108 ద్వారా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ భార్యభర్తలిద్దరూ చనిపోయారు. వీరికి  ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఒక ఎకరం పొలం మాత్రమే ఉంది. తల్లిదండ్రుల మృతితో ముగ్గురు చిన్నారులు అనాధలుగా మారారు. చిన్నారుల పరిస్థితిని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు.

Tagged couple, suicide, thimmapur, financial problems, Vikarabad

Latest Videos

Subscribe Now

More News