PEDDI: పెద్ది ఐటెం భామ లాక్.. రామ్ చరణ్‌తో స్టెప్పులేయనున్న స్టార్ బ్యూటీ.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

PEDDI: పెద్ది ఐటెం భామ లాక్.. రామ్ చరణ్‌తో స్టెప్పులేయనున్న స్టార్ బ్యూటీ.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(PEDDI). స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదలైన గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్, విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే విడుదలైన ‘చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకుపోతూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో డైరెక్టర్ బుచ్చిబాబు ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట కోసం ఇప్పటివరకు పలువురు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా బుచ్చిబాబు ఒక స్టార్ హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది.

ఈ ఐటెం సాంగ్ కోసం మొదట కాజల్ అగర్వాల్ పేరు వినిపించగా, ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాలోని కిసిక్ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించిన శ్రీలీల పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది. ఆమె దాదాపు ఖరారైందనే ప్రచారం కూడా జరిగింది. అనంతరం సమంత, పూజా హెగ్దే వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

►ALSO READ | డిజాస్టర్ కూడా రికార్డే: రాజా సాబ్తో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. డార్లింగ్ దరిదాపుల్లో లేని తెలుగు హీరోలు

కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఐటెం సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తెలుగు ప్రేక్షకుల్లో మృణాల్ ఠాకూర్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆమె గ్లామర్‌తో పాటు నటనలో ఉన్న పాపులారిటీ దృష్ట్యా, ‘పెద్ది’లో ఈ స్పెషల్ సాంగ్ ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా, ఇప్పటివరకు మృణాల్ ఎలాంటి ఐటెం సాంగ్ చేయకపోవడంతో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని కూడా ఆలోచిస్తున్నారు. అలాగే, తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల్లో మృణాల్ పేరు ప్రసెంట్ బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పెద్ది స్పెషల్ సాంగ్ చేస్తుందనే టాక్ బయటికి రావడంతో మరోసారి వైరల్ గా నిలిచింది. త్వరలోనే ‘పెద్ది’ ఐటెం భామపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ఈ మూవీని దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప్ర‌జెంట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ (AR Rahaman)సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. 27 మార్చి 2026న థియేటర్లలో విడుదల కానుంది.