డిజాస్టర్ కూడా రికార్డే: రాజా సాబ్తో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. డార్లింగ్ దరిదాపుల్లో లేని తెలుగు హీరోలు

డిజాస్టర్ కూడా రికార్డే: రాజా సాబ్తో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. డార్లింగ్ దరిదాపుల్లో లేని తెలుగు హీరోలు

టాలీవుడ్‌లో అందరి హీరోలతో పోలిస్తే బాక్సాఫీస్ పరంగా ప్రభాస్ (Prabhas) స్థాయి పూర్తిగా వేరు. విజయాపజయాలతో సంబంధం లేకుండా తన మార్కెట్‌ను నిరంతరం పెంచుకుంటూ వెళ్లడం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమవుతోంది. లేటెస్ట్గా విడుదలైన తన డిజాస్టర్ మూవీ ‘ది రాజా సాబ్’తో కూడా ప్రభాస్ టాలీవుడ్ చరిత్రలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘రాజా సాబ్’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజే రూ.112 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించినప్పటికీ, నెగటివ్ రివ్యూల ప్రభావంతో ఆ తర్వాత వసూళ్లు భారీగా పడిపోయాయి. అయినప్పటికీ, విడుదలైన 14వ రోజుకు సినిమా వరల్డ్ వైడ్గా సుమారు రూ.250 కోట్లకి పైగా గ్రాస్, ఇండియాలో రూ.142.08 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. 

అయితే, ఈ ‘రాజా సాబ్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘ఏడు చిత్రాలు ఉన్న తొలి తెలుగు నటుడిగా ప్రభాస్’ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఏ ఇతర స్టార్ హీరోకూ దక్కలేదు. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే, బాక్సాఫీస్ పరంగా ప్రభాస్ దరిదాపుల్లో కూడా ప్రస్తుతం ఎవరూ లేరు.

పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మూడేసి సినిమాలతో, ప్రభాస్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఈ గణాంకాలే ప్రభాస్ బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

►ALSO READ | Pawan Kalyan Son: AI దుర్వినియోగంపై కేసు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్..

అయితే, ఈ హిస్టారికల్ రికార్డు వెనుక ఉన్న వాస్తవాలు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.203 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఇండియా మార్కెట్‌లో ఈ సినిమా రూ.142.08 కోట్ల నెట్ కలెక్షన్ వద్దే ఆగిపోయింది.

ఫస్ట్ వీక్ తర్వాత మిక్స్డ్ టాక్ నుంచి పూర్తిస్థాయి నెగటివ్ టాక్‌గా మారడంతో వసూళ్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా, ఈ సినిమా ప్రభాస్ వ్యక్తిగత బాక్సాఫీస్ రికార్డుకు తోడ్పడినప్పటికీ, పెట్టుబడితో పోలిస్తే సగం మొత్తాన్ని కూడా రికవర్ చేయలేకపోయింది. దీంతో తెలుగు మార్కెట్‌లో ఈ చిత్రం ఫ్లాప్‌గా, మొత్తం మీద ఫైనాన్షియల్ పరంగా డిజాస్టర్‌గా నిలిచింది.

ఇకపోతే, ప్రభాస్ బాక్సాఫీస్ రికార్డులకు పునాది వేసింది మాత్రం బాహుబలి ఫ్రాంచైజీనే. ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015) ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల గ్రాస్ సాధించి, హిందీలో రూ.100 కోట్ల నెట్ వసూలు చేసిన తొలి దక్షిణ భారత చిత్రంగా చరిత్ర సృష్టించింది. దాని కొనసాగింపుగా వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ అయితే అన్ని రికార్డులను చెరిపేసింది. ఇండియా వైడ్గా రూ రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచిన ఈ సినిమా, చివరికి ప్రపంచవ్యాప్తంగా రూ.1,788.06 కోట్ల అద్భుతమైన కలెక్షన్‌తో ముగిసింది. ఈ రెండు చిత్రాలు కేవలం రికార్డులే కాదు, భారతీయ సినిమాల్లో ఈవెంట్ ఫిల్మ్ కల్చర్‌కు బీజం వేశాయి.

బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్‌లో విజయాలు – విమర్శలు కలిసి నడిచాయి. ‘సాహో’ (2019) ప్రపంచవ్యాప్తంగా రూ.451 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్ హిట్‌గా నిలిచినా, తెలుగులో మాత్రం ఆశించినంత విజయం అందుకోలేదు. రూ.350 కోట్ల బడ్జెట్ కారణంగా మొత్తం మీద, సాహో ఒక సగటు చిత్రంగానే గుర్తింపు పొందింది.

అదే విధంగా ‘ఆదిపురుష్’ (2023) మొదటి రోజే రూ.100 కోట్ల గ్రాస్‌తో సంచలనం సృష్టించినప్పటికీ, నెగిటివ్ టాక్ కారణంగా వసూళ్లు పడిపోయి రూ.600 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.400 కోట్లలోపే బాక్సాఫీస్ క్లోజ్ చేసుకుంది. 

అయితే ప్రభాస్ తిరిగి గట్టిగా పుంజుకున్నారు. ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ (2023) ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD’ (2024) అయితే రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరి ప్రభాస్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇలా బాహుబలి (2 భాగాలు), సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 AD, ది రాజా సాబ్.. ఈ ఏడు సినిమాలు రూ.200 కోట్లకి పైగా వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ఇపుడు ఈ లెక్కలు ప్రభాస్ బాక్సాఫీస్ స్థాయిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సక్సెస్ & ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నా, పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ క్రియేట్ చేసిన బాక్సాఫీస్ లెక్కలు ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఎవరికీ అందని స్థాయిలో ఉంది.