ఈవో, అర్చకుల మధ్య ఘర్షణ.. కొండగట్టు అంజన్న ఆలయంలో ఉద్రిక్తత..

ఈవో, అర్చకుల మధ్య ఘర్షణ.. కొండగట్టు అంజన్న ఆలయంలో ఉద్రిక్తత..

కొండగట్టు అంజన్న ఆలయంలో ఈవో, అర్చకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈవో శ్రీకాంతరావు తమను దూషించారంటూ ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు అర్చకులు.ఈవో శ్రీకాంతరావు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనకు దిగారు ఆలయ అర్చకులు. ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచనతో 50 మంది అభిమానులకు ప్రత్యేక దర్శనం చేయించారు అర్చకులు. 

తనకు చెప్పకుండా ప్రత్యేక దర్శనాలు ఎలా చేయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవో శ్రీకాంతరావు. ఈ క్రమంలో తమపై ఈవో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఆందోళనకు దిగారు అర్చకులు. ఈవో పరుష పదజాలంతో తమను దూషించారని.. తమకు న్యాయం చేయాలని, తమ గౌరవాన్ని, ఆచార, సంప్రదాయాలను కాపాడాలని కోరుతున్నారు అర్చకులు.

Also Read :  జీవితం అంటే ఏంటో చూపించేదే శని గ్రహం

తన అనుమతి లేకుండా ప్రత్యేక దర్శనాలు ఎలా చేయిస్తారంటూ ఈవో ప్రశ్నించగా.. ఎవరు వచ్చినా దర్శనం చేస్తామని సమాధానం ఇచ్చారు అర్చకులు. దీంతో సస్పెండ్ చేస్తానంటూ ఈవో హెచ్చరించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది వాగ్వాదం. ఆలయ గోపురం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు అర్చకులు.

ఈవో తమను దుర్భాషలాడారని ఆరోపిస్తున్నారు అర్చకులు. ఆలయం బయట నిలబడి ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అర్చకులు. ఆలయం ముందు అర్చకుల నిరసన ఇదే తొలిసారి అని అంటున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో వివాదం సద్దుమణిగింది.