జ్యోతిష్యం : జీవితం అంటే ఏంటో చూపించేదే శని గ్రహం.. గురువు కంటే గొప్పది ఈ శని గ్రహం..!

జ్యోతిష్యం : జీవితం అంటే ఏంటో చూపించేదే శని గ్రహం.. గురువు కంటే గొప్పది ఈ శని గ్రహం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు ప్రభావం ప్రతి ఒక్కరిపై ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. శుభ ఫలితాలు రావాన్నా.. అశుభ ఫలితాలు రావాలన్నా.. శని దేవుడు కీలక పాత్ర పోషిస్తుందని పండితులు చెబుతున్నారు.   శని దేవుడు ఉద్యోగవిషయంలో అద్భుతమైన ఫలితాలను అందించి... అత్యున్నతమైన స్థానాన్ని కలుగజేస్తాడు. 

 శని దేవుడు జీవితాన్ని సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాడు.  అంటే ఏ సమయంలో కష్టాలు ఇవ్వాలి.. ఎప్పుడు సుఖాలు ఇవ్వాలి.. అవి ఎంతవరకు ఉండాలి..అనే అంశాల విషయంలో కొన్ని సార్లు ఆధ్యాత్మికంగా పరీక్షలు పెట్టి.. కర్మ ఫలాన్ని  సమతుల్యం చేస్తాడు.  అందుకే పండితులు శని గ్రహాన్ని గొప్ప గురువు గ్రహం అని కూడా పిలుస్తారు.గత జీవితంలో కర్మఫలాలను ఇప్పటి జన్మకు కూడా శని భగవానుడే బదిలీ చేస్తాడని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 


పురాణాల ప్రకారం, శని దేవుడు .. సూర్యుడు..  మరియు ఛాయ (నీడ) ల కుమారుడు.    అందుకే శని దేవుడు దృష్టి.. న్యాయం ..  క్రమశిక్షణ..  సత్యం వంటి విషయాలపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి. జీవితాంతం ఎలా ఉండాలో నిర్దేశిస్తాడు. 

జాతకంలోశని దృష్టి మంచిగా ఉంటే.. స్థిరత్వంతో పాటు అనేక విషయాల్లో మంచిని కలుగజేస్తాడు.  
 శనిగ్రహం దృష్టి సరిగా లేకపోతే  కెరీర్‌లో  అడ్డంకులు,ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వస్తాయి. వ్యక్తి జాతకంలో శని తన ప్రభావాన్ని చూపించే సమయంలో కొన్ని కష్టాలను కలుగజేస్తాడు. ఆ తరువాత  శుభ ఫలితాలను ఇస్తాడు. అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి కూడా శని దృష్టి  మంచిగా ఉన్నట్లయితే అత్యున్నత స్థాయి పొందగలరు.  జాతకంలో శని శుభప్రదంగా ఉంటే..చిన్న ఉద్యోగం వచ్చినా..  తరువాత పెద్ద ఉద్యోగం పొందడానికి సహాయపడుతుంది.

శని దేవుడిని ఉద్యోగానికి కారణమైన గ్రహంగా కూడా పరిగణిస్తారు.  శని వక్ర దృష్టితో ఉన్నట్లయితే ఆ  ప్రభావం కారణంగా, ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరి జాతకంలో శని మంచి స్థితిలో ఉంటాడో, అలాంటి జాతకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు.