రెండు సూట్ కేసుల నిండా గంజాయితో రైల్లో వెళ్తున్న మహిళను అరెస్ట్ చేశారు ఈగల్ టీం పోలీసులు. రూ. 8 లక్షల విలువచేసే గంజాయిని సూట్ కేసుల్లో పెట్టుకొని ముంబై నుంచి భువనేశ్వర్ కు రైల్లో తీసుకెళ్తున్న మహిళను శుక్రవారం ( జనవరి 23 ) బేగంపేట్ రైల్వేస్టేషన్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నిందితురాలిని ఒడిశాకు చెందిన మమత దిగల్, నవీ ముంబై నివాసిగా గుర్తించారు పోలీసులు. ఈగల్ టీం ఆమెను బేగంపేటలో అరెస్టు చేసి , ఆమె సూట్ కేసుల నుంచి తొమ్మిది ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ముంబైకి చెందిన డ్రగ్స్ వ్యాపారి అశోక్ గంజాయి సంచికి రూ.10,000 ఇస్తానని హామీ ఇచ్చాడని విచారణలో వెల్లడించింది నిందితురాలు దిగల్ . అశోక్ సూచనల మేరకు తాను భువనేశ్వర్‌కు వెళ్తున్నానని తెలిపింది నిందితురాలు. గుర్తు తెలియని వ్యక్తి ద్వారా తనకు గంజాయి సూట్ కేసులు అందినట్లు తెలిపింది దిగల్.
►ALSO READ | MBBS సీటు కోసం తన కాలును తానే నరుక్కున్న కుర్రోడు
ఇదిలా ఉండగా.. నాంపల్లిలోని మంగరు బస్తీలోని ఒక ఇంటిపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందం దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 1.3 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంది. పక్కా సమాచారంతో మంగరు బస్తీలోని గణేష్, సరళ ఇంటిపై దాడి చేసిన పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నిందితుల దగ్గర నుంచి మొత్తం 180 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. మరో ఇద్దరు నిందితులు మహమ్మద్ సోహైల్, యు సీతల్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
