జ్ఞానవాపి మసీదులో శివుడికి పూజలు : కోర్టు సంచలన తీర్పు

జ్ఞానవాపి మసీదులో శివుడికి పూజలు : కోర్టు సంచలన తీర్పు

అయోధ్యనే కాదు.. కాశీ కూడా హిందూవులదే.. వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్న జ్ఞానవాపి మసీదు బేస్ మెంట్ ప్రాంతంలో శివుడికి పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2024 జనవరి 31వ తేదీన.. జ్ఞానవాపి మసీదుపై జరిగిన విచారణలో ఈ మేరకు తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.కోర్టు తీర్పుతో హిందువులకు ఇది అతిపెద్ద విజయం అని కాశీవిశ్వనాథ ట్రస్ట్ తెలిపింది. దీంతో వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీవిశ్వనాథ ట్రస్ట్ ప్రకటించింది. 

జ్ఞానవాపి మసీదులో వారం రోజుల్లో శివుడికి పూజలు చేయటానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు లాయర్ శంకర్ జైన్. ఇకపై జ్ఞానవాపి మసీదులో శివుడికి పూజలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కోర్టు తీర్పు తర్వాత కాశీ విశ్వనాథుని ట్రస్ట్ స్పందించింది. వారం రోజుల్లో మసీదులోని వ్యాస్ కా టెఖానా ప్రాంతంలో ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించింది.