బెంగాల్​లో 32 వేల మంది టీచర్ల నియామకం రద్దు ఆర్డర్​పై స్టే

బెంగాల్​లో 32 వేల మంది టీచర్ల నియామకం రద్దు ఆర్డర్​పై స్టే
  • బెంగాల్​లో 32 వేల మంది టీచర్ల నియామకం రద్దు ఆర్డర్​పై స్టే
  • కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు

కోల్‌‌కతా: బెంగాల్ స్కూల్ టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై కలకత్తా హైకోర్టు స్టే విధించింది. ఈ ఉత్తర్వులు ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రిక్రూట్​మెంట్ విధానాలు సరిగా పాటించలేదంటూ ఈ నెల 12న కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ 32,000 మంది టీచర్ల నియామకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2014లోని టెట్ ప్రకారం ట్రైనింగ్ తీసుకోని వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టారని, ఇందుకు భారీగా అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. అందుకే వాళ్లందరి అపాయింట్​మెంట్లను రద్దు చేస్తున్నామని ప్రకటిస్తూ 3 నెలల్లోగా కొత్త టీచర్లను రిక్రూట్ చేయాలని ఆదేశించింది. దీంతో బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. సింగిల్ బెంచ్ నిర్దేశించినట్లుగానే కొత్త టీచర్ల రిక్రూట్​మెంట్ నిర్వహించుకోవచ్చని సంబంధిత 
బోర్డుకు సూచించింది.