పిల్లల వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా పర్మిషన్ రాలె

పిల్లల వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా పర్మిషన్ రాలె
  • కొవాగ్జిన్​కు డీసీజీఐ అనుమతి వార్తలను ఖండించిన హెల్త్​ మినిస్ట్రీ

హైదరాబాద్, వెలుగు:  భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన చిన్న పిల్లల కరోనా వ్యాక్సిన్‌‌కు డ్రగ్స్​ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోద ముద్ర వేసినట్టు వచ్చిన వార్తలను సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ ఖండించింది. వ్యాక్సిన్‌‌కు డీసీజీఐ నుంచి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి, డాక్టర్ భారతి ప్రవీణ్ పరివార్ తెలిపారు. పిల్లలపై చేసిన ఫైనల్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్‌‌ డేటాను భారత్ బయోటెక్ సంస్థ ఇటీవలే డీసీజీఐకి అందజేసిందని, ఈ డేటాను డీసీజీఐ సబ్జెక్ట్ ఎక్స్‌‌పర్ట్ కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. 2 నుంచి 18 ఏండ్ల వయసున్న పిల్లల కోసం భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌‌ను తయారు చేస్తోంది. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది మే నెలలో ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్‌‌కు డీసీజీఐ పర్మిషన్ ఇచ్చింది. 525 మంది పిల్లలపై భారత్ బయోటెక్ ట్రయల్స్ చేసింది. ఈ డేటాను ఇటీవలే డీసీజీఐకి పంపించింది. ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన ఎక్స్‌‌పర్ట్ కమిటీపాజిటివ్‌‌గా స్పందించినట్టు భారత్​బయోటెక్​వర్గాలు చెబుతున్నాయి. కాగా, మన రాష్ట్రంలో 2 నుంచి 18 ఏండ్ల వయసున్న పిల్లలు సుమారు కోటి మంది ఉన్నారు.