
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మరో నాలుగు రోజుల్లో మూడో దశ భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ICMR నుంచి పర్మిషన్లు రావడంతో మూడో దశ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి రేపు(మంగళవారం) నిమ్స్ ఎథిక్స్ కమిటీ సమావేశం జరుగనుంది. దాదాపుగా 100 నుండి 200 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. డిసెంబర్ చివరి నాటికి మూడో దశ పూర్తి అవుతుందని అధికారులు అంటున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది అనుమతులు పొంది వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.