స్కూల్ స్టూడెంట్ల చదువులు అంతంత మాత్రమే

స్కూల్ స్టూడెంట్ల చదువులు అంతంత మాత్రమే

కరోనా టైమ్ లో తీసేయడంతో మేనేజ్ మెంట్లను వేధిస్తోన్న సబ్జెక్ట్ టీచర్ల కొరత
సరైన నాలెడ్జ్ లేని వాళ్లతో స్టూడెంట్లకు పాఠాలు
క్వాలిఫైడ్ స్టాఫ్ ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పేరెంట్స్

హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ తో రెండేళ్లుగా స్కూల్ స్టూడెంట్ల చదువులు అంతంత మాత్రంగానే సాగాయి. ఆన్ లైన్ క్లాసులు నడిచినప్పటికీ చాలామందికి అవి అర్థం కాలేదు. ఈ అకడమిక్ ఇయర్ కరోనా ఎఫెక్ట్ లేకపోవడంతో గత జూన్ లో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను మంచి చదువు కోసం స్కూళ్లను మార్చారు. డొనేషన్లు, అడ్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టర్మ్  ఫీజులంటూ వేలవేలకు కట్టిమరీ సీట్లు సంపాదించారు. కానీ స్కూళ్లు ప్రారంభమై 8 వారాలు గడుస్తున్నా క్లాసులు జరగకపోవడం, హోంవర్క్ లు లేకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం  ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న టీచర్ల కొరతేనని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఒకప్పుడు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 70శాతం క్వాలిఫైడ్ టీచర్లుంటే, 30 శాతం నాన్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండేవాళ్లని, కానీ ఇప్పుడు అది తారుమారైపోయిందని చెప్తున్నారు. దీనిపై త్వరలోనే విద్యాశాఖ మంత్రిని, అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నామని తెలంగాణా ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షబ్బీర్ అలీ అన్నారు. 

లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. .
స్కూళ్లు మొదలై 2 నెలలు దాటిపోయింది. స్కూల్ లో చేర్పించడానికి ముందే టర్మ్ ఫీజుతో పాటు అన్ని ఫీజులు కట్టినా.. కొన్ని ప్రైవేటు స్కూళ్లలోనూ వారం పదిరోజుల వరకు స్టూడెంట్లకు బుక్స్ ఇవ్వలేదు. మరికొన్ని స్కూళ్లలో క్లాసులను అంతంత మాత్రంగా తీసుకోవడం మొదలుపెట్టారు. అసలే రెండేళ్లుగా ఫిజికల్ గా క్లాసులు లేకపోవడంతో పిల్లలు లెర్నింగ్ లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నారు. రెండు, మూడు తరగతులకు చెందిన స్టూడెంట్లు అక్షరాలు కూడా సరిగా చదవలేకపోతున్నారు. ఈ అకడమిక్ ఇయర్ నుంచైనా స్టడీస్ బాగుండాలని చాలా మంది పేరెంట్స్ తాపత్రయపడ్డారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లల డైరీల్లో హోం వర్క్స్ లేకపోవడం, ఆ రోజు జరిగిన పాఠాలను చదవకపోవడంతో పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆందోళన మొదలవుతోంది. స్కూళ్లకు వెళ్లి మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను అడిగినా సరైన సమాధానం ఇవ్వట్లేదని పేరెంట్స్ చెబుతున్నారు.  

ట్యూషన్లకు పంపుతూ...
కరోనా టైమ్ నుంచి అన్ని సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ట్యూటర్లను పెట్టించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేరెంట్స్ చెబుతున్నారు. ఆన్ లైన్ క్లాసులు సరిగా అర్థం కాకపోవడంతో లాక్ డౌన్ నుంచే పేరెంట్స్ వారి పిల్లలను  హోం ట్యూటర్లను పెట్టారు. ఇటు స్కూళ్లకు ఫీజులు కడుతూ ట్యూటర్లకు కూడా రూ.వేలకు వేలు చెల్లించారు. ప్రస్తుతం స్కూళ్లు ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రారంభం కావడంతో ఈసారి నుంచి అలాంటి సమస్య ఉండదనుకున్నారు. కానీ కొన్ని ప్రైవేటు స్కూళ్లలో నాలెడ్జ్ లేని టీచర్ల కారణంగా మళ్లీ వారికి పిల్లల చదువుపై ఆందోళన మొదలైంది. దీంతో ఇంటికి చుట్టుపక్కల ఉన్న ట్యూషన్లలో చేర్పిస్తున్నట్లు పేరెంట్స్ చెబుతున్నారు.

మేనేజ్ మెంట్ నుంచి భరోసా లేకపోవడం వల్లే...
ప్రైవేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ షార్టేజ్ ఉంది.   ఉన్నవారిలో కూడా క్వాలిఫైడ్ టీచర్లు లేరు. రెండేళ్లుగా కరోనా ఎఫెక్ట్​తో ఆర్థిక, మానసిక ఇబ్బందులతో 30 నుంచి 35శాతం మంది టీచర్లు ఫీల్డ్ మారిపోయారు. దీంతో గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే మేనేజ్​మెంట్లు స్కూళ్లను నడిపిస్తున్నాయి. క్వాలిఫైడ్ టీచర్ల కోసం మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు వెతుకుతున్నా.. వారికి మళ్లీ అదే పరిస్థితి వస్తుందని టీచర్లు భయపడుతున్నారు. స్కూల్ మేనేజ్ మెంట్ నుంచి భరోసా లేకే చాలామంది మానేశారు. అన్ క్వాలిఫైడ్ స్టాఫ్ వల్ల పిల్లల చదువు పాడవుతోంది. - షబ్బీర్ అలీ, అధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరమ్

నేర్చుకున్నవన్నీ మర్చిపోయారు..
మా అబ్బాయి థర్డ్, పాప ఫస్ట్ క్లాస్ చదువుతోంది. నేను నా భర్య ఇద్దరం పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. అయినా మా  పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించాం.  రెండేళ్లు ఆన్ లైన్ క్లాసుల కారణంగా వాళ్లకు ఏం అర్థం కాలేదు. గతంలో నేర్చుకున్నవన్నీ మర్చిపోయారు. అందుకే ఈ సారి స్కూల్ మార్చాం. ఇద్దరికీ కలిపి ఫస్ట్ టర్మ్​ కింద రూ.30 వేలు ఫీజు కట్టాం. 2 నెలలు దాటినా అబ్బాయి చదువులో ఏం మార్పు కనిపించట్లేదు. బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీచర్లు ఏం చదవాలో రాయడం లేదు. భయంతో మళ్లీ ట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టించాం. అటు స్కూల్ ఫీజు, ఇటు ట్యూషన్ ఫీజు కట్టడం ఇబ్బందిగా మారింది.- మనోహర్, పేరెంట్, షేక్ పేట