IPL 2026 mini-auction: ధోనీ, గైక్వాడ్, ఫ్లెమింగ్ మీటింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ వీరే

IPL 2026 mini-auction: ధోనీ, గైక్వాడ్, ఫ్లెమింగ్ మీటింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ వీరే

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను చర్చించడానికి త్వరలో మహేంద్ర సింగ్ ధోనీతో ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ త్వరలో సమావేశం కానున్నారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఈ ముగ్గురూ చర్చించనుండగా.. తుది నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (CSKCL) చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాసన్ తీసుకుంటారు.

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 14 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తాం అని ఐపీఎల్ సమయంలోనే ధోనీ చెప్పాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్ లో పూర్తిగా నిరాశపర్చిన కొంత మంది ప్లేయర్లను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వారెవరో ఇప్పుడు చూద్దాం. 

డెవాన్ కాన్వే

న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు గత కొన్ని సీజన్ లుగా నమ్మదగిన ఆటగాడు. 2023, 2022 ఐపీఎల్ సీజన్ లలో అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం కాన్వే ఫామ్ ఏమంత బాలేదు. అతను అంతర్జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ కివీస్ ఓపెనర్ ను రూ. 6. 25 కోట్ల ధరకు దక్కించుకున్నారు. అయితే తన పాత్రకు ఏమాత్రం న్యాయం చేయలేదు. ఒక్క హాఫ్ సెంచరీ తప్పితే మిగిలిన మ్యాచ్ ల్లో కనీస ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో రానున్న సీజన్ లో ఈ కివీస్ ప్లేయర్ ను పక్కన పెట్టొచ్చు. 

Also Read:-వెస్టిండీస్ అసాధారణ పోరాటానికి చెక్.. ఢిల్లీ టెస్టులో విజయం దిశగా టీమిండియా

రాహుల్ త్రిపాఠి

ఈ సీజన్ లో ఘోరంగా విఫలమైన మరో ఆటగాడు రాహుల్ త్రిపాఠి.  పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడిన త్రిపాఠి.. స్ట్రైక్ రేట్ దారుణంగా ఉంది. కేవలం 96.49 స్ట్రైక్ రేట్‌తో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. 11.00 సగటుతో ఈ సీజన్ లో 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ. 3.80 కోట్లు పెట్టి దక్కించుకున్న త్రిపాఠి.. కొంచెం కూడా న్యాయం చేయలేకపోయాడు. దీంతో రానున్న సీజన్ లో త్రిపాఠిని కొనసాగించడం దాదాపు అసాధ్యం.  

దీపక్ హుడా

మిడిల్ ఆర్డర్ లో హిట్టర్ గా పనికొస్తాడని తీసుకుంటే దీపక్ హుడా ఒక్క మ్యాచ్ లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. మెగా ఆక్షన్ లో రూ. కోటి 70 లక్షలకు చెన్నై జట్టులో చేరిన ఈ హిట్టర్.. ఆడిన తొలి 5 మ్యాచ్ ల్లో 4 సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడంటే అతని ఫామ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఫామ్ లేకపోయినా చెన్నై పదే పదే అవకాశాలిస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు. ఈ ప్రదర్శనతో చెన్నై హూడాను రిటైన్ చేసుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.  

చెన్నైకి రవి చంద్రన్ అశ్విన్ గుడ్ బై:

ఐపీఎల్ 2025 లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్తిగా నిరాశపర్చాడు. సొంతగడ్డపై చెలరేగుతాడనుకుంటే చెన్నైకి భారంగా  మారాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ ను రూ. 9.75 కోట్లు పెట్టి తీసుకుంది. అయితే అశ్విన్ మాత్రం ఈ  సీజన్ లో ఏడు మ్యాచ్ ల్లో 44.60 సగటుతో ఐదు వికెట్లు తీసుకున్నాడు. కొన్ని మ్యాచ్ ల్లో ప్లేయింగ్ 11 లో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ను చెన్నై వచ్చే ఏడాదికి రిలీజ్ చేయడం గ్యారంటీ గా మారింది. ఈ సమయంలో అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు.