జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. మైత్రివనం దగ్గర.. కారులో దొరికిన పాతిక లక్షల డబ్బు !

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. మైత్రివనం దగ్గర.. కారులో దొరికిన పాతిక లక్షల డబ్బు !

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల తనిఖీల్లో భాగంగా చేసిన తనిఖీల్లో అన్ అకౌంటెడ్ నగదును స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ సీజ్ చేసింది. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 25 లక్షల నగదును స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది. మైత్రివనం దగ్గర తనిఖీలు చేస్తుండగా TS09FF 6111 నంబర్ కారులో ఈ డబ్బు కనిపించింది. వైజాగ్కి చెందిన శ్రీ జైరాం తలాసియా అనే వ్యక్తి నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ తెలిపింది.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాధీనం చేసుకున్న డబ్బును స్థానిక మధురానగర్ పోలీసులకు అప్పగించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పంజాగుట్ట పోలీసులు శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఒక కారులో రూ.4 లక్షల నగదు, 9 చివాస్ రీగల్ మద్యం బాటిల్స్‌‌ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

ఎన్నిక జరిగే అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని లేదా మెట్రోపాలిటన్ నగరాలు లేదా మునిసిపల్ కార్పొరేషన్లలో ఉంటే ఎన్నికల ప్రవర్తన నియామవళి కేవలం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిందన్నారు. ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధానితో పాటు మెట్రోపాలిటన్ నగరంలో భాగస్వామ్యం కావడంతో కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పకడ్బందీగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.