
ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) 10 మంది విద్యార్థులపై పోలీసులు కేసు బుక్కైంది. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా వర్ధంతిని పురస్కరించుకుని కాలేజీ పర్మిషన్ లేకుండా క్యాంపస్‌లో ఒక మీటింగ్ పెట్టారనే ఆరోపణలతో కేసు నమోదు చేసారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, గత ఆదివారం చెంబూర్‌లోని TISS క్యాంపస్‌లో సాయిబాబా మొదటి వర్ధంతి జరుపుకునేందుకు విద్యార్థులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఢిల్లీ అల్లర్ల కేసులో జైల్లో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థులు షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్‌లకు మద్దతుగా విద్యార్థులు నినాదాలు చేశారు.
కాలేజీ యాజమాన్యం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని, ఈ విషయం తెలిశాక TISS అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ట్రోంబే పోలీసులు సోమవారం చట్టవిరుద్ధంగా గుమికూడటం, గ్రూపుల మధ్య గొడవలు రెచ్చగొట్టడం, దేశ ఐక్యతకు భంగం కలిగించే పనులు చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
►ALSO READ | బెంగళూరులో దారుణం.. అడిగినందుకు ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన క్యాబ్ డ్రైవర్..
ఇప్పటికే ఈ కేసులో 10 మంది విద్యార్థులను గుర్తించి, వారికి నోటీసులు పంపామని పోలీసులు చెప్పారు. అలాగే దీని పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన మళ్లీ విద్యార్థుల ఉద్యమాలు, కాలేజీల్లో స్వేచ్ఛ, చట్టపరమైన పరిమితుల గురించి చర్చకు దారి తీసింది. TISS సంస్థ క్యాంపస్‌లో ఎలాంటి రాజకీయ లేదా అనుమతి లేని కార్యక్రమాలను సహించబోమని మరోసారి స్పష్టం చేసింది.
మావోయిస్టు సంబంధాల కేసులో గతంలో అరెస్ట్ అయిన సాయిబాబాను 2024లో బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దీనికి ఏడాది ముందే అంటే 2024 అక్టోబర్ 12న ఆయన చనిపోయారు.