బెంగళూరులో దారుణం.. అడిగినందుకు ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన క్యాబ్ డ్రైవర్..

బెంగళూరులో దారుణం.. అడిగినందుకు ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన క్యాబ్ డ్రైవర్..

బెంగళూరులోని ఓ 39 ఏళ్ల వ్యాపారవేత్తపై క్యాబ్ డ్రైవర్ చెంపదెబ్బ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. టోల్ చార్జెస్  కట్టకుండా తప్పించుకునేందుకు  డ్రైవర్ వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించగా, ప్రయాణీకుడు అభ్యంతరం చెప్పడంతో ఈ వివాదం చెలరేగింది. మైసూరు రోడ్డులో ఉంటున్న  భరత్ రామారావు ఫిర్యాదుతో పోలీసులు డ్రైవర్ ముజాహిద్ అలీ ముజీబ్ అలియాస్ ముజాహిద్ పాషా (36)ను అదే రోజు అరెస్టు చేశారు. 

వివరాలు చూస్తే అక్టోబర్ 9న ఢిల్లీ నుండి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)కి చేరుకున్నాక భరత్, అతను బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో డ్రైవర్ ముజాహిద్ అతన్ని విమానాశ్రయంలో  పికప్ చేసుకున్నాడు. అయితే, డ్రైవర్ టోల్ ప్లాజా నుండి వెళ్లకుండా వేరే రోడ్డు నుండి వెళ్లేందుకు ప్రయత్నించగా... నేను ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టాను, టోల్ రోడ్డు నుండి కాకుండా వేరే రూట్లో ఎందుకు వెళ్తున్నావు  అని డ్రైవర్‌ని అడగ్గా.. అతను వెంటనే నాపై అరిచాడు అని భరత్ చెప్పారు.

►ALSO READ | ఎన్నికల్లో పోటీకి టికెట్ నిరాకరణ.. ఏకంగా CM ఇంటి ముందే ఎమ్మెల్యే ధర్నా

దింతో నేను కార్ ఆపమని గట్టిగా చెప్పగానే, అతను కోపంతో ఉగిపోయాడు. వెంటనే నేను క్యాబ్ దిగిపోయాను, కిందకి దిగాక నేను అతని ఫోటో తీసేందుకు ట్రై చేయగా..  దాంతో డ్రైవర్ కారు దిగి వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టాడు. అక్కడ ఉన్న చాలా మంది ఇదంతా చూస్తున్న ఎవరూ సహాయం చేయలేదు అని భరత్ వివరించారు.

చివరికి నేను పోలీసు హెల్ప్‌లైన్ 112కు కాల్ చేశాను. పోలీసులు వచ్చేలోపే డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు అతని వివరాలు తీసుకుని అదే రోజు రాత్రి 10 గంటలకు అరెస్టు చేశారు. కారణం ఏదైనా, ఒకరిపై దాడి చేయడం చట్టవిరుద్ధం అని, డ్రైవర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.