24 గంటల్లో 20 వేల 551 కరోనా కేసులు

24 గంటల్లో  20 వేల 551 కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. 20 వేల మార్క్ ను దాటుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. పలు రాష్ట్రాల్లో అధికంగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 20 వేల 551 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం ఈ సంఖ్య 19 వేల 893 ఉండగా బుధవారం 17 వేల 135గా ఉంది. వైరస్ నుంచి 21 వేల 595 మంది రికవరీ అయ్యారు.

మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364 ఉన్నట్లు వెల్లడించింది. డైలీ పాజిటివిటి రేటు 5.14శాతంగా ఉన్నట్లు తెలిపింది. మొత్తం 4,34,45,624 మంది కోలుకున్నట్లు, మొత్తం మరణాల సంఖ్య 5,26,600 ఉందని పేర్కొంది. కరోనా వైరస్ నుంచి చెక్ పెట్టడానికి వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 2,05,59,47,243 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.